అ మాజికల్ పెయింటర్ పార్ట్ 4
 |
| ఒక రూమ్ పెయింట్ |
ఈ కథలోని పాత్రలు పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఇందులో రాయబడిన సమయాలు కరెన్సీ మరియు వ్యవస్థ కేవలం కల్పిత కథ మాత్రమే ఈ కథ ఎవరిని ఉద్దేశించినది కాదు ఈ కథ లోని భావాలు కేవలం వినోదం కోసం మాత్రమే వ్రాయబడినవి
కొత్త జీవితం హృదయ్ ఆ మాజికల్ పెయింటర్
 |
| ఆ రోలర్ ఆ బ్రష్ |
3000 డబ్బులు ఒక రూమ్ పెయింట్ వేస్తే వస్తాయి మనకి కాస్త అన్నం మంచి చెడు ఒక వారం రోజులు ఇబ్బంది లేకుండా జరిగి పోతది అనే ఆలోచన తో హృదయ్ సరే సార్ మేము ఇస్తున్నాం అని
ఆ రోలర్ ఆ బ్రష్ తీసుకొని చూస్తే అందులో ఓ కాగితం మీద
యధా యధా హృదయ వాంచ నెరవేర్చ బడును గాక ......
అని రాసి ఉన్న మాట ఆర్ తేరి ఇద్దరు చదివి చూసి అవ్వక్ అయ్యారు అయినా అదంతా ఏముందిలే మనకి పని జరిగి తిండి మంచి చెడు జరుగు బాటు జరిగితే చాలున్లే అని ఆ కార్ ఎక్కి వెళ్ళి పోతారు
ఆ ధనవంతుని రూమ్ పెయింట్ చేయడానికి ఇద్దరు సిద్ధమై ఆ రూమ్ దగ్గరికి చేరుకొని డ్రెస్ మార్చుకొని
అక్కడ ఉన్న ఆ పెయింట్ బాగా మిక్స్ చేసుకొని ఈ రోలర్ బ్రష్ తో హృదయ్ మరియు అమిత్ షాప్ లో నుండి తెచ్చిన కొత్త రోలర్ బ్రష్ తో పెయింట్ వేయడం మొదలు పెట్టారు
అక్కడ పెయింట్ వేస్తున్న హృదయ్ కి మేధా రాజ్యం లో మొత్తం మీద ఆ 10 ధనవంతులు ఈ ధనవంతుడే అందరీ కన్నా మొదటి వాడు అని తెలియడం తో
అమిత మరి హృదయ్ అమ్మో విల్లా దగ్గర ఇంత నల్ల ధనం ఉందా
నల్ల ధనం నేరం మనిషి బతకడానికి కొంత చాలు
 |
| ఆ రోలర్ ఆ బ్రష్ |
ఒక మనిషి బతక డానికి కొంత డబ్బు సరిపోతుంది కథ మరి ఇన్ని వేల కోట్లు తరతరాలకు సరిపోయే అంత డబ్బు అవసరమా ఇంత డబ్బు దొంగ తనంగా ఎందుకు దాచుకోవడం ప్రభుత్వం దగ్గర ఎందుకు ఇలా దాచడం ఇదంతా మన మేధా దేశపు పేదవారి అధికారపు సొమ్ము కథ ఒక వేళ ఈ ధనం ఇతను
దాచకుండా నీతి న్యాయం నేర్వేస్తూ సక్రమంగా దాచితే మన దేశం లో పేదరికం అనే మాట ఆకలి అనే మాట ఉండదు
పేదవాడు ఎవడు కూడా కూటి కోసం చావడు కదా
ఇంత ధనం ప్రభుత్వాన్ని పెడవాలన్నీ మోసం చేస్తూ దాచిన
ఈ ధనవంతుడు డబ్బులం తినడు కదా ఇతను కనీసం తృప్తిగా మాంసం కూడా తిన లేదు ఇతను తిన బోయే పెరుగు అన్నం కోసం ఇంత ధనం అవసరం లేదు కదా అంటూ అమిత్ , హృదయ్
మాట్లాడు కుంటు వాళ్ళు ఆ ధనవంతుడి ఇంట్లో ఆ రూమ్ నీ చాలా అద్భుతంగా పెయింట్ వేస్తారు గోడలు చాలా మెరుపుగా
అద్భుతంగా కనిపిస్తాయి ఆ గోడలు మాట్లాడే గోడల ల తల తల మంటూ సౌందర్యంగా మరి పోతాయి
ఇదంతా చూసిన ఆ ధనవంతుడు హృదయ్ కి నువ్వు మామూలు పెయింటర్ వీ కాదు నువ్వు ఆ మాజికల్ పెయింటర్
అని బిరుదు తో పాటు ఓ 2000 ఎక్కువ ఇచి పంపిస్తాడు
నల్ల ధనం పై రోలర్ చేసే ప్రతీకారపు న్యాయం
 |
| పని అయిపించు కొని |
ఆ పని అయిపించు కొని హృదయ్ అమిత్ ఇంటికి వెళ్ళి పోయారు కానీ ఆ యమదూతలు హృదయ్ కి ఇచ్చిన రోలర్ వాళ్ళు మాట్లాడుకున్న ఆ మాటలు అన్ని విని ఆ రోలర్ లో దాగి ఉన్న
హృదయ్ వాంఛ నెరవేరును గాక అనే
ఆమె మంత్రం ఆ గోడలకి వేసిన రంగులలో దాగి ఉండి
మరుసటి రోజు ఉదయం ఆ ధనవంతుని జీవన్ శైలి లో కలిసి పోయింది
ఇంత డబ్బు నీకు బతకడికి అవసరమా అంటూ ఏ వైద్యుడు కనిపెట్ట లేని వ్యసనంగా మారి పోయింది
ఆ ఇంట్లో ఉన్న ఆ ధనవంతుడు కడుపు కి తింటే అరగదు తినక పోతే బతక లేడు ఏ వైద్యుడు ఈ జబ్బు నీ కనిపెట్ట లేదు అతను దాచుకున్న ధనం అతనికి కడుపు కి అన్నం పెట్టలేదు కొంచెం తింటే ఎక్కువ అవుతుంది తినక పోతే ఆకలి అవుతుంది
ఏమి చేసుకుంటాడు కొన్ని వేల కోట్ల ధనం ఒక్క పూట భోజనం కూడా తినలేని పరిస్థితి ఏర్పడింది
ధనవంతుడికి ఉన్న రోగం కోసం ఎన్నో రకాల రక్త పరీక్షలు చేశారు ఏమి అర్ధం.కాలేదు ఇతర దేశాల నుండి ఎంతో మంది డాక్టర్స్ వోచారు చూసారు కొన్ని కోట్లు డబ్బు చేశారు ఫలితం లేదు
రకాల మెషినరీ రక రకాల స్కానింగ్ చేసిన అతని శరీరంలో ఏ లోపం కనిపించలేదు
డాక్టర్స్ ఒక్కత్తే మాట చెప్పే సారు అసలు శరీరం లో సమస్య అనేది లేకపోతే ఏ మెడిసిన్ వాడిన ఏ ఆపరేషన్ చేసిన ఏమి ఉపయోగం
ఇలా ఆ ధనవంతుడు 15 రోజులకు గాను 40 కేజీ ల బరువు తగ్గి ఎములు కనిపించే అంతగా బరువు తగ్గి పోయాడు
ప్రతి రోజు రాజుల విందులో కూర్చొని తినే ఆ నల్ల ధనం దాచుకున్న దేశాని దోచుకున్న ఆ ధనం ఉన్న ఆ టాప్ 10 లో ఒక్క నంబర్ 1 ధనం ఉన్న ఆ వ్యక్తి కనీసం పెరుగు అన్నం కూడా తిన లేక పోతే అతనికి ఉన్న ఆ డబ్బు ఎందుకు ఏమి చేయడానికి
ఇప్పుడు ఆ మాజికల్ పెయింటర్ యొక్క రోలర్ ఎవరికి ఏ హాని చేయలేదు కానీ డబ్బుతో ఆకలి తీరదు అనే మాట అర్ధం అయ్యేలా చేసింది
ధనవంతుడు ఆకలి కి ఇక ఆపుకో లేక అతను హృదయ్ పెయింట్ వేసిన ఆ రూమ్ కి వెళ్ళి
ఆ మాజికల్ వాల్ ఇన్ తీస్ వరల్డ్
Magical wall in this world"
 |
| పూర్తి కాంతితో |
తలుపులు మూసి ఫ్యాన్ కి ఒక తాడు కట్టి కాలి కింద స్టూల్ పెట్టీ ఊరి వేసుకుందాం అని లైట్స్ ఆఫ్ చేయగానే
అతను పెయింట్ వేయించిన గోడలు పూర్తి కాంతితో వెలిగి ఉన్నాయి మరియు ఆ గోడల మీద పెద్ద పెద్ద అక్షరాలలో ఇలా రాసి ఉంది
నల్ల ధనం దాచుకొని ఏమి సాధించావ్ నువ్వు సాధించిన నీ
 |
| నల్ల ధనం దాచుకొని ఏమి సాధించావ్ |
ధనం నీ ఆస్తులు నీ కడుపు ఆకలి కేవలం 10 రూపాయల విలువ గల 2 ఇడ్లీ అయిన నివు తిన గలిగావా లేదు లేక 50 రూపాయల భోజనం తిన గలిగావా లేదు కనీసం నీ సంపద తో కాస్త పెరుగు అన్నం అయిన తిన గలిగావా ఆది కూడా లేదు
ఇప్పుడు నువ్వు అక్రమంగా పేదవారి కడుపు కొట్టి దాచిన ఆ నల్ల ధనం నీ ఆకలి తీర్చ మను లేదా ఆ డబ్బు నీ తిని నీ ఆకలి తీర్చుకో అని రాసి ఉంది
ఇది చదివిన ఆ ధనవంతుడు
ఊరి వేసుకోవడం ఆపి
తన పూర్తి కుటుంబాన్ని పిలిచి చూపిస్తాడు తదుపరి
సొంత ఆస్తి పేద వారి అందరికీ తను దాచిన మొత్తం బ్లాక్ డబ్బు నీ పేదవారికి పంచడమే కాకుండా అతను దాచుకున్న బినామీ స్థలాలలో పేదవారికి సొంత గృహాలు నిర్మించి ఇవ్వడమే కాకుండా అతని
నిరుపేద కుటుంబాలలో ఉన్న చదువుకొని ఉద్యోగం లేక సతమతం అవుతున్న వారిని వేతకం కోసం ఒక కొత్త సెర్చ్ టీమ్ నీ ఏర్పాటు చేసి తన కంపెనీ లలో ఉన్న ఖాళీలను పూర్తి చేస్తూ
దేశంలో ఓ కొత్త పిలుపు అందిస్తాడు ఆ పిలుపు పేరు
నా దేశపు యవ్వనుడా మీరే ఈ దేశపు వెన్నుముక్కలు అంటూ ఓ కొత్త తరపు గీతాని దేశానికి అందిస్తాడు
ఇప్పుడు మేధా దేశం లో మొదటి స్థానం లో ఉన్న నెంబర్ వన్ ధనవంతుడి మార్పు చెందడం వల్ల దేశం లో కొన్ని వేల కోట్ల ధనం దేశ ప్రజలకు చెందడం వల్ల మేధా దేశం ఆర్థిక పరిస్థితి లో చాలా మార్పులు జరగడం వల్ల మేధా దేశపు కరెన్సీ కూడా ఇప్పుడు ప్రపంచం లో 10 వ స్థానానికి చేరుకుంది
మాజికల్ పెయింటర్ రంగుల ప్రపంచం
ఈ మార్పు ఇంతటితో ఆగలేదు ఆ ధనవంతుడికి కేవలం తన దగ్గర ఉన్న నల్ల ధనం ఇవ్వడం వల్ల దేశంలో ఇంత మార్పు రావడం గమనించాడు అతను మార్పు చెంది వృద్ధులకు ఎన్నో వృద్ధాశ్రలు ,, అనాథ పిల్లలకి అనాథ శరణాలు ఉచితంగా తన సొంత సంపాదన తో ఏర్పాటు చేశాడు
ఇప్పుడు ఉన్న సమయం లో ఆ ధనవంతుడు మరల ఆ రూమ్ కి వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసి చూసినప్పుడు మరల ఆ గోడలు చివరి మెరిసి కొన్ని అక్షరాలు కనిపిస్తాయి
 |
| ఈ మార్పు |
ఈ మార్పు బతికినంత కాలం కొనసాగించు ఈ నీతి తో కలకాలం జీవించు విడుదల చెంది సంతోషంగా జీవించు
ఇక హృదయ్ కి పనులకి కొదువ లేదు ఆ బ్రష్ రోలర్ లు ఎప్పటికీ పాడు కావు కొత్త కొత్త పనులు వస్తూనే ఉన్నాయి
ఆ మిగిలిన 9 ధన వంతులకు కూడా ఈ ఆకలి దప్పికలతోనే ఆ మాజికల్ పెయింట్ రోలర్ సమాధానం ఇచ్చింది
ఇకపై హృదయ్ అమిత్ ఆ మాజికల్ పెయింటర్ పేరుతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తూ గొప్ప స్థాయి కి చేరుకున్నారు
మేధా దేశం ఇప్పుడు అందరి మార్పులతో చాలా ధనం ఉన్న దేశంగా మారి
ఆ మాజికల్ రోలర్ ఆ హృదయ్ మూలాన దేశ వ్యవస్థ నే మార్చేసింది
నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆ దేశం లో పేదరికం అనే మాట లేదు
మనం దేశం లో ఉన్న వ్యవస్థ నీ ఎప్పుడూ ఆదాల ఉంది ఇది ఇలా ఉంది అని తిడుతూ ఉంటాము కానీ నిజంగా దేశం లో ఉన్న ధనవంతులు మారితే మేధా దేశం లో మార్పు వచ్చినట్టు అన్ని దేశాలలో ఒస్తుంది
సగటు ఒక మనిషి తన జీవితం మొత్తం బతకడానికి ఒక కోటి నో లేదా 2 కోట్ల డబ్బు సరిపోతుంది కనింసమాజం లో ఉన్న క్రూరత్వం వ్యవస్థ కి తెలియకుండా దాచుకుంటుంటే దీనికి వ్యవస్థ ఏమి చేయలేదు
ఒక యమ ధర్మరాజు బతులకే ఇంత మార్పు తెచ్చి పెట్టే అంత బలం ఉంటే నిజంగా దైవం అనుకుంటే సమస్తం నిర్మూలం చేయగలదు
సో మీరెంత దాచుకున్న చివరికి ఏమి తీసుకు పోలేరు మీరు దాచుకునే డబ్బు ఏ మీ పాలిట యమ పాశం ల మారి మీకు స్వర్గం లోని నరకం లోని శిక్ష వేయదు బాగా లోతుగా ఆలోచించి చూడండి
అంత డబ్బు దాచుకున్న మీరు ప్రశాంతంగా నిదుర పో గలుగు తిన్నారా , సరిగా మీకు నచ్చిన ఆహారం తిన గలుగు తున్నారా
మీకు నచ్చినది తినలేక , ప్రశాంతంగా నిదుర పోలేక మీకు నిదుర టాబ్లెట్ కావలసి వొస్తుంది అని మీకు అనిపిస్తే
మేధా దేశం లాగా మన దేశాన్ని కూడా మార్చండి
అని ఆ మాజికల్ పెయింటర్ ప్రతి ధనవంతుడి ఇంటికి ఆ రోలర్ తో పెయింట్ వేసి వోచాకా ఆ గోడలపై ఈ రాతలు కనిపిస్తాయి
అందుకే ఈ కథని
అ మాజికల్ పెయింటర్ కి అంకితం చేస్తూ కథ ముగించిన హృదయ్ అనే మాజికల్ పెయింటర్ ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ధనవంతుడి ఇంట్లో గోడలకి యమ బాతులు ఇచ్చిన ఆ రోలర్ తో పెయింట్ వేస్తూనే ఉంటాడు
సమాప్తం
ఈ స్టోరీ పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పార్ట్ 1ఈ స్టోరీ పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పార్ట్ 2ఈ స్టోరీ పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పార్ట్ 3
© copyright challagali Yesudas All Rights reserved
Comments
Post a Comment