అ మాజికల్ పెయింటర్ Part 1 | Telugu Suspense Story

   అ మాజికల్ పెయింటర్ 

ఈ కథ కేవలం కల్పితం మాత్రమే ఇందులోని పాత్రలు సన్నివేశాలు వినోదం కోసం మాత్రేమే రాయబడ్డాయి .

ఈ కథ ఒక మామూలు 21 ఇయర్స్ పెళ్ళి కానీ ఒక యువకుడిది 

బతకడానికి ఏ పని చేసిన తప్పు లేదు

( మేధా ) అనే ఒక నగరం ఈ నగరం ఏ దేశానికి చెందినది కాదు .
మేధా


ప్రపంచం లో ఎవరు చూడని ఎవరికి తెలియని చూడడానికి చాలా నిరుపేద దేశం అనిపించేలా సూర్యుడు హస్తమించే ప్రదేశం లో లోకపు చివరి అంచున ( మేధా ) అనే ఒక నగరం ఈ నగరం ఏ దేశానికి చెందినది కాదు .


  1. దానికంటూ ఒక ప్రత్యేకత దానికంటూ ఒక కరెన్సీ ఒక వ్యవస్త ఒక ప్రత్యేకపు గుర్తింపు ఉన్న
  2.  ప్రపంచ వ్యాప్తంగా ఆది ఒక నిరుపేద దేశం అని గుర్తింపు పొంది ఉంది .

 కానీ నిజానికి ఆ దేశం లో ఉన్నంత డబ్బు ఈ ప్రపంచం లోనే ఎవరి దగ్గర లేదు అంతు చిక్కని ధనం లెక్క లేనంత సొమ్ము దాగివున్న దేశం మేధా దేశం 

ఇక్కడ 10 మంది కార్పొరేట్ వ్యవస్థాపకులు అమితంగా దాచుకున్న నల్ల ధనం ఎవరికి లెక్క రాకుండా చిక్కుకు పోయి ఉంది 
మేధా అనే దేశం లో దాగుందన్న సంగతే ఇతర దేశాలకి తెలియదు.

                     మేధా సిటీ లో ఒక లేబర్

కళాశాలలో హౌస్ కీపింగ్ పని
కళాశాలలో హౌస్ కీపింగ్ పని


వయసు 21 ఏ పని దొరక ఆ ఊరి కుర్రాడు ఒకడు

అతని పేరు హృదయ సిమెంట్ మూటలు మోసే పనికి వెళ్తూ ఉండవాడు
 అతను కాస్త బరువు మనిషి కావడం వల్ల ఆ పని చేయలేక , మూటలు మోయలేక, తన జీవితాన్ని నెగ్గలేక సతమతమై నలిగిపోతూ ఈ లోకపు వింటారు కొమ్మ లో ఎలాగోలా ఊగుతూ ఉన్నట్టు , అదోలా , ఏదోలా , ఎలాగోలా బతికేస్తూ ఉన్నాడు.

అతని స్నేహితుడు అమిత్ రే మచ్చా నాకు తెలిసిన ఒక కళాశాలలో హౌస్ కీపింగ్ పని ఖాళీగా ఉన్నది నెలకి 2000 జీతం ఇస్తారు మనము కూడా వెళ్దామా అక్కడ పని దొరికితే బాగుంటుంది.

 అక్కడ అన్ని ఫ్రీ రా అన్నం రూమ్ ఎటువంటి ఖర్చు లేదు అని వివరించాడు 

హృదయ : ఆర్ ఇదేదో బాగానే ఉంది రా రూమ్ ఖర్చు లేదు అన్నం ఖర్చు లేదు పైగా పనికూడా బరువైంది కాదు సరే మనం వెళ్దాం అని ఒప్పేసుకుంటాడు

నెక్ట్ డే ఆ కళాశాల యాజమాన్యం తో భేటీ అయి అతను 2000 జీతానికి పనికి జేరిపోతాడు 
అక్కడ మంచి ఫుడ్ మంచి నిద్ర ఒక మంచి వ్యవస్థ 
ఉదయం 8 గంటలకి పనికి వెళ్ళడం 4 గంటలకి రూమ్ కి రావడం స్నానం చేసి హ్యాపీగా ఉండడం తినడం పడుకోవడం  అంత మంచిగా ఒక సంవత్సరం బాగా సాగిపోయింది 1 యియర్ ఎప్పుడూ అయి పోయింది కూడా  తెలియంత ఈజీగా ఆ యియర్ ఐపోయింది .

తన పై అధికారుల మధ్య బాండింగ్ ఏర్పడింది
  తన సినీర్ వర్కర్స్ దగ్గర మంచి పేరు పొందాడు హృదయ

ఉదయాన్నే వెళ్ళడం అతనికి అప్పగించిన సీ ఎస్ సీ ల్యాబ్ నీ శుబ్రంగా ఊడ్చుకొని బాగా నిట్టుగా తుడిచి 

బాయ్స్ మరియు లేడీస్ ఈ రెండు టాయిలెట్స్ క్లీన్ చేసి 
మిగతా సమయం లో సార్రోలు చెప్పిన పనులు చేసి ఖాళీగా కూర్చోవడమే అతని పని

ఇది ఇలా ఉండగా ఒక రోజు ఆ కళాశాల లో హృదయ్ మంచి తనం గురించి తెలియని ఓ కొత్త మేడమ్ అతను పని చేస్తున్న ఆ సీ ఎస్ సీ ల్యాబ్ కి అపాయింట్ అయింది

        హృదయ్ నీ ఒణికించి అతనిపై నిందలు 

మేనేజర్ నుండి కళాశాల చైర్మన్ వరకు ఒక్క కంప్లైంట్
మేనేజర్ నుండి కళాశాల చైర్మన్ వరకు ఒక్క కంప్లైంట్ 



ఆమె ల్యాబ్ కి చేరు కున్న మారు క్షణమే వెనుక ముందు ఆలోచించకుండానే ఆఫీస్ మేనేజర్ నుండి కళాశాల చైర్మన్ వరకు ఒక్క కంప్లైంట్ పంపించేసింది ఈ కళాశాల లో నిట్నెస్ లేదు క్లీనింగ్ సారిగా లేదు ఎవరు ఇక్కడ పని చేసేది అతనిని ఇప్పుడే తీసేసి మరొకలని భర్తీ చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్ లో కూర్చొని త్హుర్ మంటూ వెళ్ళిపోయింది

మరుసటి రోజు ఆ కళాశాల మేనేజర్ అండ్ సూపర్వైజర్ ఇద్దరికి హృదయ్ వ్యక్తిగతంగా చాలా మంచోడు అని పూర్తిగా నమ్మకం ఉండబట్టి 

హృదయ్ నీ విధులలో నుండి తొలగించ కుండ ఆఫీస్ కి పిలిచి 
రే హృదయ్ నీ మీద మాకు కంప్లైంట్ ఒచ్చింది నీ క్లీనింగ్ వర్క్ బాగాలేదు అంటూ కొత్తగా చేరిన మేడమ్ ఆగ్రహం తో ఉంది

జాగ్రత్తగా నడుచుకో అంటూ చెప్పగా 

హృదయ్ కంగారు పడుతూ  సరే సార్ నేను జాగ్రత్తగా చేస్తాను అంటూ వెళ్ళి 

ల్యాబ్ లో జెంట్స్ టాయిలెట్ కడిగేసి లేడీస్ టాయిలెట్ కడగ డానికి సిద్ధమయ్యాడు 

మళ్ళీ రోజు ఉదయానే .


  అవమానం మంచితనం తో భరించిన హృదయ్


ఏ అబ్బాయి ఎంచేస్తున్నావ్
ఏ అబ్బాయి ఎంచేస్తున్నావ్ 



మరల ల్యాబ్ కి చేరుకొని మేడమ్ గారు హృదయ్ లేడీస్ టాయిలెట్ క్లీన్ చేస్తున్న సమయం లో లోపలికి చొరబడి 

ఏ అబ్బాయి ఎంచేస్తున్నావ్ అని అడిగింది
హృదయ్ : మేడమ్ కాసేపటికి మీరు దయచేసి బయటకి వెళ్తారా నేను ఈ టాయిలెట్ నీ శుభ్రం చేయాలి 

ఆ మేడమ్ : అవును సరే సరే 

అంటూనే  ఆమె దగ్గర ఉన్న సానిటరీ ప్యాడ్ నీ కావాలనే అక్కడ పడేసి ఏ అబ్బాయి ఏంటి ఇది సరిగ్గా చెయ్ అంటుంది

హృదయ్ : సరే మేడమ్ నేను చేస్తాను 
అంటూ ఆమె కనుల ముందే అంత శుభ్రం చేస్తాడు 

అంత మంచిగా చేసిన కూడా ఆ మేడమ్ 

ఇతని పని సరిగా లేదు అంటూ మరల ఆఫీస్ కి వెళ్ళి మరో సారి కంప్లైంట్ చేసింది

               మేనేజర్ గద్దింపు ఇక పనిష్మెంట్


go to home
go to home 




మేనేజర్ హృదయ్ నీ ఆఫీస్ కి పిలిపించి  
మేనేజర్ : ఏంటి హృదయ్ నువ్వు మంచిగా పని చేసుకుంటున్నావ్ అని నేను విన్నాను

కానీ ఈ రోజు మరల నీ పై ఆ మేడమ్ గారు కంప్లైంట్ చేశారు అసలు csc ల్యాబ్ లోనే ఇలాంటి సమస్య ఎందుకు మళ్ళీ మళ్ళీ ఎందుకు కొస్తుంది  అర్థం కావట్లేదు నీ వైపుగా నువ్వేమైనా చెప్పుకోవాలని అనుకుంటే చెప్పు 

హృదయ: అలా ఏమి లేదు సార్ నేను నా పని కరెక్ట్ గానే చేసాను ఆమె కావాలనే పదే పదే ఇలా చేస్తే మాత్రం నేను ఏమి చేయగలను 

అనగా మేనేజర్ నీ సమాధానం సరిపడలేదు 
కనుక నిన్ను సస్పెండ్ చేస్తున్నాను go to home 
 సార్ అలా అనకండి సార్ 

మేనేజర్ : నిన్ను ఇది సెకండ్ టైమ్ చూస్తున్న మొదటి కంప్లైంట్ కి ఏమి అనలేదు కానీ ఇప్పుడు డైరెక్ట్ గా పైన నుండి నిన్ను పనిలో నుండి తీసేయమని చెప్పారు 

హృదయ్ చేసేది ఏమి లేక అక్కడ నుండి తన బట్టలు వస్తువులు తీసుకొని బయటకి వెళ్ళిపోతాడు


ఇకపై పార్ట్ 2 లో మిగతా భాగం చదువుదాం .....అసలేం జరిగింది ఈ స్టోరీ పబ్లిష్ అయిన మరుసటి రోజు దీనినిండి వర్షన్ కూడా పబ్లిష్ చేయబడును...

© Copyright challagali Yesudas All Rights reserved 


 


Comments

Popular posts from this blog

పాత టంకు పెట్టె (Part 1)

LAST CIGARETTE (లాస్ట్ సిగరెట్) - భాగం 1

మిథున: ద జంగిల్ వే (Mithuna: The Jungle Way) — Part 3