భాగం 6 - చెట్టు కింద దెయ్యం | Telugu Deyyam Katha | Adhvanshika

1. మర్రి చెట్టు కింద అధవంశిక ప్రత్యక్షం





గాలి లో ఒక వింత వాసన వ్యాపించింది. అది పూలు కాదు, వందల సంవత్సరాలుగా కుళ్లిన చెక్క, తడిసిన సమాధి నుండి వస్తున్న మట్టి వాసన.

వెంటనే మర్రి చెట్టు  మొదలు లోపల నుండి ఒక గొంతు వినిపించింది - "తపస్సు పూర్తి అయ్యింది. కిందికి దిగు."

కామినీ గంటల తరబడి తలకిందులుగా వేలాడుతూ ఉంది. నరాల లో బలహీనత అంత  తలలో చేరిపోయింది. కొంగు ముడి విప్పగానే తను నేలపై పడిపోయింది. మోకాళ్లకు దెబ్బ తగిలింది కానీ అరుపు రాలేదు.

ముందు నిలబడి ఉన్నది మనిషి కాదు.

ఏడు అడుగుల ఎత్తు. కాళ్లు వెనక్కి తిరిగి ఉన్నాయి. చర్మం అంటే  చీకటిని చర్మంగా చేసినట్టు నల్లగా ఉంది. జుట్టు మర్రి ఊడల్లో కలిసిపోయింది. కళ్లలో ఒకే కంటిలో ఎనిమిది రంగులు ఒకేసారి మండుతున్నాయి.

దాని అడుగుల కింద నుండి పొగ వస్తోంది.

కామినీ గొంతులో  నుండి ఊపిరి రావడం లేదు, కానీ తనను తాను గట్టిగా కోరుకున్నది. ఇప్పుడు భయపడితే చచ్చిపోతుంది.

పళ్లు బిగించి అడిగింది - "నువ్వు ఎవరు?"

మొదలు నుండి సమాధానం వినిపించింది - "నువ్వు ఎవర్ని పిలిచావు?"

కామినీ - "నేను సకుచితో పాటు ఏడుగురిని ఒకేసారి పిలిచాను. పేర్లు చెప్పను."

ఆ ఆకారం ఇప్పుడు తన చుట్టూ తిరుగుతోంది. ప్రతి చుట్టుకీ ఎండు ఆకులు సుడిలాగా ఎగిరెగిరి పడుతున్నాయి.

సమాధంగా "అయితే నేనే దాన్ని. అందరినీ కలిపి ఒకటే - అధ్వాషికని నువ్వు పిలిచిన నీ మంత్రోచ్చారణ కి సమాధానాన్ని నేనే."

2. ఆత్మ ధార మరియు చీకటి మూల శర్తు




అధవంశిక ఆగలేదు, తిరుగుతూనే ఒప్పందం గురించి చెబుతోంది.

అధవాషిక : "నియమం తెలుసా? పిలిచాక వెనక్కి పంపడం ఉండదు."

కామిని : నాకు "తెలుసు."

అధవంశిక :"అయితే మూల్యం విను - మేము నీ మాట వినాలంటే దానికి మూల్యం చెల్లించాలి
కామిని : ఏంటి ఆ మూల్యం చెప్పు
అధ్వంశిక : ఆ మూల్యం ఏ జంతువు కాదు , నీ ఆత్మని మాకు ఇవ్వాలి 

కామిని : ఇవ్వడం అంటే ?
అధవంశిక : నువ్వు నీలాగే ఉంటావ్ కానీ నీ ఆత్మ మాత్రం మా దగ్గర కొడువగా ఉంచ బడుతుంది ఒక రకంగా చెప్పాలంటే నీ ఆత్మ నీ మేము కొనేసినట్టే , సమస్తం నిధి కాని నీ ఆత్మ మాది ఆది నీకు తిరిగి ఇవ్వము 

ఒక క్షణం కామినీ గుండె ఆగిపోయింది. సింహ ద్వారం దగ్గర దయావీర్ వెనక్కి కూడా చూడకుండా వెళ్లిపోవడం గుర్తొచ్చింది. ఆ అవమానం దాని ఆత్మ ఖరీదు కన్నా ఎక్కువ ఎక్కువ అనిపించే అంత బాధ .

కామిని: "ఒప్పుకుంటున్నా."

అధవంశిక నవ్వింది, ఆ నవ్వుకి మర్రి చెట్టు ఊడలు మొత్తం ఊగాయి.

"రెండో నియమం విను. నీ గదిలో ఒక మూల నాది. అక్కడ ఎప్పుడూ చీకటే ఉంటుంది. దీపం, దివ్వె, సూర్య కాంతిలో ఒక గీత కూడా అక్కడ పడితే - అదే క్షణం నేను నీ ఆత్మను లాగేసుకుని వెళ్లిపోతాను. నా లోకం లోకి. శాశ్వతంగా." ఇక ఎప్పటికీ తిరిగి రాము

కామినీ రెప్ప కొట్టకుండా చెప్పింది - "ఒప్పుకుంటున్నా. ఇక నుండి మీరు నా బానిసలు."

"గంట పడిపోయింది."

ఆ ఒక మాటతో గాలిలో ఎనిమిది పేర్లు మార్మోగాయి - కటేరీ, సకుచి, బేతాళ, బటులా, బటువా, బౌనా, బ్రువులా మరియు పేరులేనిది ఇంకొకటి.

ఆ ఎనిమిది ఇప్పుడు ఒక శరీరంలో ఉన్నాయి.అదే అన్ని కలిపి అధవంశిక.

అది కామినీ వెనక నడవడం మొదలు పెట్టింది. కామినీకి స్పష్టంగా తెలుస్తోంది ఎవరో వెనక ఉన్నారని, మెడ మీద ఊపిరి పడుతోందని, కానీ వెనక్కి చూస్తే ఎవరూ లేరు. మహల్ ఆవరణంలోకి వచ్చాక, చందమం వెలుగులో నేల మీద తెర చూసింది - దాని నీడ పడటం లేదు.

3. మోహం మర్చిపోవడం మరియు దయావీర్ పై దాడి



మరో రోజు ఉదయం కనకమైన విషయం జరిగింది.

కామినీ గతం అంత   మర్చిపోయింది ఎందుకు ఏడ్చిందో ఎందుకు బాధపడింది అన్ని విషయాలు ఇప్పుడు పగ లాగా వ్యాపించాయి

ఏ దయావీర్ కోసం తను మర్రి చెట్టు మీద ప్రాణం పణంగా పెట్టి వేలాడిందో, ఆకలి దాహంతో మంత్రం దండనం చేసిందో, అదే మోహం ఇప్పుడు గుర్తు రావడం లేదు. ఆత్మ అమ్మేసినప్పుడు సహజంగా ప్రేమ అనే భావమే ముందుగా  చచ్చిపోతుందన్న విషయం కామిని కి తెలియదు. ఆమె గుండెలో ఇప్పుడు ప్రేమ బదులు పెద్ద ఖాళీ గొయ్యి, దానిలో ఉడుకుతున్న కోపం మాత్రమే ఉంది.

ఆ కోపమే అధవంశిక కి  ఆజ్ఞ ఇచ్చింది - వెళ్ళు వెళ్ళి "వాడిని పిచ్చోడిని చేసేయి."

రాత్రి సరిగ్గా పన్నెండు గంటలు. చింతామణి రాజ్యం లో అందరూ నిద్రపోతున్నారు. కావలివాళ్లు కూడా గాఢ నిద్ర లోకి జారి తులు తున్నారు .

కిటికీ సందులో నుండి చూడకుండా నల్ల పొగ లోపలికి వచ్చింది. పాములాగా పాకుతూ వెళ్లి దయావీర్ మంచం దాకా వెళ్ళి. అతని తలపై కూర్చుంది.

దయావీర్ నిద్రలోనే గిలగిలా కొట్టుకోవడం మొదలు పెట్టాడు. తల నరాలు పొంగాయి.

ఉదయం కుమారి దయవీర నీ లేపి, అతని కళ్లు చూడగా ఎర్రగా బాగా బాగా మండే నిప్పుల కణం లాగా మారిపోయి  ఉండడం చూసింది. ఆమె అది చూడగానే ఆమెకు విషయం అర్థమైంది దయవీర కి ఏదో జరిగిందని గ్రహించిన ఆమె అతని 

కుమారి: "నేను ఎవరో తెలుసా?" కుమారి ఏడుస్తూ అడిగింది.

దయావీర్ దాన్ని తోసి - "నేను నిన్ను ఎరుగను. దూరంగా పో."

అదే పిచ్చిలో కత్తి తీసి  అరిచాడు - "వైయ్యార్ మీద యుద్ధం!"

కుమారి అరుస్తూనే ఉండిపోయింది, కానీ అతను ఆగలేదు. వైయ్యార్ సింహ ద్వారం దగ్గర వాడి మామగారే చేతులు జోడించి అన్నాడు - "బాబు, నువ్వు అల్లుడివి, వెనక్కి వెళ్లిపో."

దయావీర్ కత్తి లాగాడు. యుద్ధం జరిగింది. కానీ ఇది ముందే ఓడిపోయిన యుద్ధం. పది మంది యోధులను ఒక్కడే యతి పడేసే యోధుడు, ఈ రోజు దెబ్బ కూడా చూడలేకపోతున్నాడు. ఎందుకంటే యుద్ధం మైదానంలో కాదు, వాడి మనసు లోపల జరుగుతోంది. రెండు దెబ్బలకే బందీ అయే పరిస్థితి.

4. కుమారి భిక్ష, తల్లి దారం మరియు సూర్య భవన ఆదేశం



వార్త మంటలాగా వ్యాపించగా. కుమారి పిచ్చిదానిలా పరిగెత్తుతూ వైయ్యార్ వెళ్లింది. తన తండ్రి సింహాసనం ముందు మోకాళ్ల మీద పడిపోయింది.

"నాయనా, భిక్ష పెట్టు. నా మాంగల్యం తిరిగి ఇవ్వు. ఇవి మా వారు కాదు, వారి మీద ఏదో  ఉంది."

ఒక రాజుకి తన కూతుర్ని ఈ స్థితిలో చూడడం కంటే పెద్ద ఓటమి లేదు.అనుకున్న బయ్యర్ రాజ్యపు మహారాజు అనగా కుమారి.,కామిని ల తండ్రి గారు వెంటనే దయావీర్ ని విడుదల చేశాడు.

కుమారి వాడిని తీసుకుని చింతామణి తిరిగి వస్తుంటే, దారిలో సైనికులు, దాసులు అందరూ నవ్వుతున్నారు - "చూడండి, యోధుడి భార్య తన భర్త కోసం భిక్ష అడుగుతోంది."

కుమారి అంతా వినింది, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

దారిలో తన చిన్న నాటి సఖి కలిసింది, చెవిలో గుసగుసగా చెప్పింది - "నేను కామినీ గదిలో ఆ చీకటి మూలలో అంతా విన్నాను. ఎనిమిది ఆత్మలు ఉన్నాయి అక్కడ. తను తన ఆత్మని సీత  ఆత్మను అమ్మేసి.నీ భర్త పై ఇలాంటి పన్నాగం పన్నింది"

కుమారి అప్పుడు అక్క మీద ప్రేమతో ఆ మాట పట్టించుకోలేదు.

కానీ దయావీర్ మహల్ కి రాగానే, తన తల్లి గుమ్మం దగ్గరే నిలబడి ఉంది. కొడుకు పరిస్థితి చూసి కేక వేసింది. వెంటనే కాళీ గుడి నుండి తెచ్చిన దారం - దాని మీద ఇరవై ఒక్క రోజులు మంత్రం చదివింది - వాడి చేతికి కట్టింది.

దారం కట్టగానే దయావీర్ శరీరంలో ఒక జట్కా వచ్చింది, లోపల ఏదో అరిచినట్టు అనిపించింది. ఆ దారం దయవీర చేతిని తాకగానే అతను కొంచెం కొంచెం కుదారత పడ్డాడు, కానీ పూర్తిగా తగ్గలేదు.

అక్కడ వైయ్యార్ లో కామినీ ఆ చీకటి మూల ముందు కూర్చొని నవ్వుతోంది. తను గెలిచాను అనుకుంటున్నా.

ఇక్కడ చింతామణిలో మహారాణి అందరినీ బయటకు పంపించి పక్క రాజ్యం లో ఉన్న  తమ్ముడిని రహస్యంగా పిలిచింది.

"తమ్ముడు, విను దయవీర నీ అవహించింది  ఎనిమిది ఆత్మల వశం. ఇంకా వేరే ఉపాయం లేదు. ఎవరికీ చెవిలో కూడా పడకూడదు. కాళ్ల చప్పుడు కూడా రాకూడదు. ఉదయం నాలుగు గంటలకి, సూర్యుడు రాకముందే, సూర్య భవనానికి చేరుకో. అక్కడ ఉన్న లాఠీ, శబ్దం లేకుండా కొట్టేది. ఒక చప్పుడు అయినా అధవంశిక మేలుకుంటుంది, దయావీర్ శాశ్వతంగా వెళ్లిపోతాడు."

ఇప్పుడు అందరి ఊపిరి ఆ  తమ్ముడి అడుగుల మీద,ఆధారపడి ఉన్నాయి మహారాణి తమ్ముడు దయవీర నీ తీసుకొని  ఆ చీకటి దారి మీద బయలు దేరాడు, ఇద్దరు కలిసి ది సూర్య భవనం వైపు ప్రయాణం అయ్యారు . అక్కడి షరతులు ... కాలి శబ్దం కూడా రాకూడదు అనేదే.

ఈ కథ మిగతా భాగాల కోసం కింద ఇచే వాటి పై క్లిక్ చేయండి

భాగం 1 కోసం

భాగం 2 కోసం

భాగం 3 కోసం

భాగం 4

భాగం 5

© Copyright challagali Yesudas All Rights reserved

Comments

Popular posts from this blog

పాత టంకు పెట్టె (Part 1)

LAST CIGARETTE (లాస్ట్ సిగరెట్) - భాగం 1

మిథున: ద జంగిల్ వే (Mithuna: The Jungle Way) — Part 3