ఆ చివరి మలుపు: భార్యాపిల్లలను అనాథలను చేసిన ఆ తప్పు | Telugu Moral Story
పహేలీపూర్ గ్రామం, షెహనాయ్ మరియు ఒక తిరుగుబాటు
పహేలీపూర్ అనే ఒక చిన్న గ్రామం. పట్నానికి దూరంగా, పొలాల మధ్యలో ఉన్న ఆ గ్రామంలో ఇప్పటికీ కులం, గోత్రం అనే మాటలకు చాలా విలువ. ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లో, ప్రతి అరుగు మీదా కులం గురించే మాట్లాడుకుంటారు. అదే గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తి ప్రీతం ప్యార్యే.
ప్రీతం ప్యార్యే వయసు ముప్పై ఏళ్లు దాటింది. చదువు పెద్దగా లేదు, ఆస్తి అంతకన్నా లేదు. కానీ మనసు మాత్రం వెన్న లాంటిది. ఎవరికి ఏ కష్టం వచ్చినా పరుగెత్తుకుంటూ వెళ్లేవాడు. అయితే అతనిలో ఒకే ఒక బలహీనత ఉంది, అది మొండితనం. ఒకసారి అనుకున్నాడంటే దాన్ని చేసి తీరాల్సిందే.
అతను అదే గ్రామంలోని వేరే కులానికి చెందిన అమ్మాయి లిఖితను ప్రేమించాడు. లిఖిత చూడటానికి చాలా అందంగా ఉంటుంది, మనసు ఇంకా అందమైనది. ఇద్దరూ చిన్నప్పటి నుండి ఒకరినొకరు చూసుకుంటూ పెరిగారు. ప్రీతం సన్నాయి వాయిస్తుంటే, లిఖిత దూరం నుండి వింటూ నిలబడేది. ఆ సన్నాయి శబ్దంలోనే వారి ప్రేమ చిగురించింది.
ఒక పెళ్లి వేడుకలో ప్రీతం సన్నాయి వాయిస్తుండగా. లిఖిత పక్కనే కూర్చుని చూస్తూ ఉంది. అతని కళ్ళు ఆమె కళ్ళను కలిశాయి. ఆ చూపులోనే ఎన్నో మాటలు , భావాలు ,ఇరువురి హృదయాల మర్మాలు . ఆ తర్వాత చాటు మాటుగా కలుసుకోవడి, మాట్లాడుకోవడం, ప్రేమ పెరగడం మొదలైంది. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు బతకలేంతగా .
కానీ గ్రామం గ్రామ కట్టుబాట్లు ఒప్పుకోలేదు. వేరే కులం అమ్మాయిని చేసుకుంటావా అని ప్రీతం కుటుంబం అతన్ని ఇంటి నుండి గెంటేసింది. లిఖిత తల్లిదండ్రులు కూడా, నువ్వు మాకు చచ్చిపోయావని తలుపులు మూసేశారు.
ఆ రోజు ఇద్దరూ గ్రామం విడిచి పారిపోయి, గుడిలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. అది ప్రేమ వివాహం కాదు, అది ఒక తిరుగుబాటు.
ఆ తిరుగుబాటు తర్వాత వారికి ఎవరూ లేరు. సొంత ఇల్లు లేదు, భూమి లేదు. పహేలీపూర్ పక్కనే ఉన్న ఒక చిన్న అద్దె ఇంట్లో ఉంటూ జీవనం కొనసాగిస్తూ.
అక్కడే ఒక పాత ఇంట్లో ఆ ఇంటి పైన రేకులు, లోపల ఒకే ఒక గది, చిన్న వంటిల్లు. వర్షం వస్తే నీళ్లు కరీనా. కూడా ఆ ఇల్లు వారికి స్వర్గం. ఎందుకంటే అక్కడ వారి ఇద్దరి మధ్య ప్రేమ అనే విత్తనం చిగురిస్తూ ఉంది.
భగవంతుడు వారి ప్రేమకు సాక్షిగా ఇద్దరు పిల్లలను ఇచ్చాడు. పెద్దది 8 ఏళ్ల పాప, పేరు చిన్నదే అయినా తెలివి పెద్దది. చిన్నవాడు 5 ఏళ్ల బాబు, అల్లరి పిల్లాడు, ఎప్పుడూ నాన్న భుజం మీదే ఉండేవాడు. పిల్లలు లేని లోటు తీరింది. కుటుంబం లేకపోయినా, బంధువులు లేకపోయినా, ఆ నలుగురితో వారి ప్రపంచం నిండి సంతోషం తో వెళ్ళి విరిసింది.
ప్రీతం దగ్గర పెద్ద చదువు లేదు, ఉద్యోగం లేదు. కానీ దేవుడు ఇచ్చిన ఒక కళ ఉంది - సన్నాయి మరియు డోలు వాయించడం. అతను సన్నాయి పట్టుకున్నాడంటే, రాళ్లు కూడా కరిగిపోతాయి. పెళ్లిళ్లలో, శుభకార్యాలలో, గుడి ఉత్సవాల్లో అతని సన్నాయి లేకపోతే ఆ కార్యక్రమమే జరగదు. గ్రామంలో ఒక సామెత కూడా ఉంది.
"ఏ శుభకార్యం అయినా సరే, ప్రీతం ప్యారా సన్నాయి లేకపోతే ఆ వేడుక పూర్తి కాదు."
ఆ కళతోనే అతను తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజుకు వంద, రెండు వందలు వచ్చినా, దానితోనే సంతోషంగా బతుకుతున్నారు.
లిఖిత ఎప్పుడూ అతని కళను గౌరవిస్తూ. నువ్వు ఉన్నావు, నాకు అదే గొప్ప భాగ్యం అనేది.
ఒక రోజు వేసవి కాలం. ఎండలు మండిపోతున్నాయి. రాత్రి అయ్యేసరికి కరెంటు పోయింది. ఆ చిన్న అద్దె ఇంటి ముందున్న ఆవరణలో నలుగురూ ఒక పెద్ద మంచం మీద పడుకున్నారు. పైన నక్షత్రాలతో నిండిన ఆకాశం. చల్లని గాలి వీస్తోంది. పిల్లలు నిద్రపోతున్నారు. లిఖిత ప్రీతం భుజం మీద తల వాల్చి ఆకాశం లోని చుక్కలని చూస్తూ అధరాలను ముని పంటితో నిమురుతూ ,,,చాలా ప్రేమగా ఇలా మాట్లాడ సాగింది.
లిఖిత: ఏమండీ, మన పిల్లల్ని బాగా చదివించాలి కదా. వాళ్లను పై చదును చదివించి ఉద్యోగస్తులని చేయాలి.
అప్పుడైనా మా అమ్మా నాన్నా నన్ను క్షమిస్తారేమో. ఒక రోజు వాళ్లు తప్పకుండా వస్తారు, మన కోసం కాకపోయినా పిల్లల కోసం అయినా .
ఆ మాటల్లో ఎంత ఆశ ఉందో, ఎంత బాధ ఉందో ప్రీతంకు అర్థమైంది. అతను ఆమె తలను నిమురుతూ .
ప్రీతం: భయపడకు లిఖితా. మనకు అమ్మా నాన్నా లేకపోతే ఏమైంది? నేను ఉన్నాను కదా. నీకు నేను, నాకు నువ్వు, మనకు ఈ ఇద్దరు పిల్లలు. ఇదే మన కుటుంబం. మన పిల్లల్ని నేను బాగా చదివిస్తాను. వాళ్లను పెద్ద వాళ్లను చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. ఈ నిద్రపోతున్న పిల్లల మొహాలు చూడు, ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. నేను బతికి ఉన్నంత వరకు మీకు ఏ కష్టం రానివ్వను. నీకు అమ్మ నాన్న నీ నేనే మనకి మనమే అన్ని .
ఆ మాట వినగానే లిఖిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె అతని గుండెల మీద తల పెట్టుకుని గాఢంగా నిద్రపోయింది. ఆ రాత్రి ఆ చిన్న గూటిలో ఎంత ప్రశాంతత ఉందో మాటల్లో చెప్పలేం.
ఆ చిన్న గూడు, ఆ చెడు అలవాటు మరియు పోలీసుల గుణపాఠం
జీవితం సంతోషంగా సాగిపోతోంది. అంతా బాగానే ఉంది అనుకునే సమయంలోనే, ప్రీతంలో ఉన్న ఒకే ఒక చెడు అలవాటు అతని నీడలా వెంటాడేది. అదే బండి వేగంగా నడపడం.
అతని దగ్గర 200 సీసీ బైక్ ఉంది. నల్లగా మెరుస్తూ ఉంటుంది. దానిని అతను తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు. కానీ దాని మీద కూర్చున్నాడంటే చాలు, అతనికి వేగం పిచ్చి పట్టుకునేది. రోడ్డు ఖాళీగా ఉందా, నిండుగా ఉందా అని చూసేవాడు కాదు. యాక్సిలేటర్ తిప్పడం తప్ప, బ్రేక్ ఎక్కడ ఉందో లేదో చూసుకోడు.
లిఖితకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే ప్రతి రోజు అతను బయటకు వెళ్లేటప్పుడు గుమ్మం దగ్గర నిలబడి, తన చేతులతో హెల్మెట్ ఇచ్చి, కళ్ళల్లో భయంతో చెప్పేది.
లిఖిత: ఏమండీ, జాగ్రత్త. దయచేసి నెమ్మదిగా వెళ్లండి. హెల్మెట్ పెట్టుకోండి. త్వరగా రావాల్సిన అవసరం లేదు , కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు మీరు మాత్రం చిన్నగా జాగ్రత్తగా ఇంటికి రండి మీరు నెమ్మదిగా ఇండ్లు చేరితే చాలు.
ప్రీతం: సరే సరే, నువ్వు ప్రతి రోజు ఇదే చెబుతావు. నాకు అంతా తెలుసు. నువ్వు లోపలికి పో.
అని చెప్పి వెళ్లిపోయేవాడు. కానీ వీధి మలుపు తిరగగానే హెల్మెట్ తీసి పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టీ. గాలి జుట్టును తాకుతుంటే, బండి 80, 90 స్పీడ్ తో దూసుకుపోతుంటే అతనికి ఏదో గొప్ప అనిపించేది. చాలా సార్లు కాలు జారి పడబోయాడు, మోకాళ్ళు చిట్లాయి, చేతులు కొట్టుకున్నాయి. అయినా ఆ వేగం పిచ్చి తగ్గలేదు. అది అతనికి ఒక వ్యసనంగా మారింది.
ఒక రోజు అలాగే సిటీ వైపు నుండి వస్తున్నాడు. రోడ్డు మీద హెల్మెట్ చెకింగ్ జరుగుతోంది. దూరం నుండి పోలీసులను చూశాడు. భయంతో ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. వెనుక టైరు గీతలు గీస్తూ స్కిడ్ గా. టైరు కాలిన వాసన వచ్చింది. బండి అదుపు తప్పి నేరుగా బారికేడ్ ను ఢీకొట్టబోయి ఆగింది. అక్కడున్న వాళ్లందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్న ఎస్ ఐ గారు చూశారు. ఆయనకు కోపం రాలేదు, జాలి వేసింది. ఆయన ప్రీతంను దగ్గరకు పిలిచి.
ఎస్ ఐ: ఏమయ్యా, ఎక్కడికి అంత తొందర? స్వర్గానికి టికెట్ బుక్ చేసుకున్నావా? ఇలా బండి నడిపితే ఇంటికి ఎలా చేరుకుంటావు? ఆకాశంలో ఎగురుతున్నావా ఏంటి?
ప్రీతం భయంతో: లేదు సార్, చూసుకోలేదు సార్, సారీ సార్.
ఎస్ ఐ: నీ లైసెన్స్, పీయూసీ, ఇన్సూరెన్స్ తీసి చూపించు.
ప్రీతం వణుకుతున్న చేతులతో జేబులో నుండి పత్రాలన్నీ తీసి ఇచ్చాడు. ఇదిగో సార్, అన్నీ ఉన్నాయి సార్, అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అన్నాడు.
ఎస్ ఐ పత్రాలు చూసి: పత్రాలన్నీ పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. కానీ నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు. ఓవర్ స్పీడ్ తో వచ్చావు. అందుకే నీకు 250 రూపాయల ఫైన్ వేస్తున్నాను. ఆన్లైన్ లో కట్టేసుకో పో.
ఆ మాట వినగానే ప్రీతంకు కోపం వచ్చింది. అన్నీ ఉంటే కూడా ఫైన్ వేస్తారా అని వాదించాడు .
ప్రీతం: ఇదేంటి సార్ అన్యాయం. అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే, హెల్మెట్ కూడా బండి మీదే ఉంటే మీరు ఫైన్ వేయడం ఏంటి సార్. ఇది కేవలం డబ్బులు తీసుకోవడం కోసమే.
అప్పుడు ఎస్ ఐ గారు చాలా ప్రశాంతంగా, ఒక అన్న లా చెప్పారు.
ఎస్ ఐ: చూడు తమ్ముడు, పత్రాలు జేబులో ఉంటే నీ ప్రాణం నిలబడదు. హెల్మెట్ బండి మీద ఉంటే నీ తలకు రక్షణ కాదు, అది తల మీద ఉంటేనే రక్షణ. మేము ఫైన్ వేసేది నీ జేబు ఖాళీ చేయడానికి కాదు, నీ ఇల్లు ఖాళీ కాకుండా ఉండటానికి. నీ కోసం ఇంట్లో ఇద్దరు పిల్లలు, భార్య ఎదురు చూస్తుంటారు కదా. వారి కోసమైనా నెమ్మదిగా వెళ్ళు. వెళ్ళు ఇంటికి.
ఆ మాటలు ప్రీతం చెవిలో పడలేదు. పోలీసులు డబ్బులు తీసుకుంటారనే అపోహతోనే ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇంటి దగ్గరకు రాగానే ప్రపంచమే మారిపోయేది. బండి శబ్దం వినగానే ఇద్దరు పిల్లలు పరుగెత్తుకుంటూ వచ్చి, నాన్న వచ్చేశాడు అంటూ అతని కాళ్లకు చుట్టుకునేవారు. ముద్దులు పెడుతూ లవ్ యూ నాన్న అనేవారు. లిఖిత వెంటనే లోపలికి వెళ్లి ఫ్రిజ్ లో నుండి చల్లని నీళ్లు తెచ్చి ఇచ్చేది.
లిఖిత: చాలా అలసిపోయారు కదా, కూర్చోండి. టీ పెట్టనా? స్నానం చేసి భోజనం చేద్దాం.
ఆ ప్రేమ ముందు బయటి కోపం అంతా కరిగిపోయేది.
ఆ రోజు వారి పెళ్లి రోజు. 13వ వార్షికోత్సవం. ప్రీతం జేబులో నుండి ఒక చిన్న గిఫ్ట్ తీశాడు. అది ఖరీదైనది కాదు, కానీ ప్రేమతో నిండినది.
ప్రీతం: లిఖితా, ఇది మన చిన్న గూడు. నువ్వు ఈ గూటికి రాణివి. నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నీతో కలిసి ఆకాశంలో ఎగరాలని ఉంది. దొరికిన ఈ జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. హ్యాపీ 13th యానివర్సరీ మై బేబీ.
లిఖిత కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. అవ్వ్వ్ థాంక్యూ అంటూ అతన్ని గట్టిగా పట్టుకుంది. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రులను చుట్టేసి, ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ డాడీ , హ్యాపీ యానివర్సరీ అంటూ ముద్దులు కురిపించారు. ఆ క్షణం వారి జీవితంలో అత్యంత అందమైన క్షణం.పిల్లల సందడి తో వారి జీవితం అందాల హరివిల్లు లా విరభూస్తూ ప్రతి పుట్ట ,గులాబీ మొగ్గల సుహాసన వలె రోజు కొత్తగా ఉండేది.
ఆ చివరి రోజు మరియు ఒక తప్పు నిర్ణయం
ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎందుకంటే ప్రీతంకు బండి వేగంగా నడపడం అనే దెయ్యం ఇంకా వదలలేదు.
మరుసటి రోజు ఉదయం, ఒక కొత్త ఇంటి గృహప్రవేశానికి సన్నాయి వాయించడానికి పిలుపు అందింది. ప్రీతం చాలా సంతోషంగా తయారై బయలుదేరాడు. అక్కడ అతను తన ప్రాణం పెట్టి సన్నాయి వాయించాడు. వచ్చిన అతిథులందరూ చప్పట్లు కొట్టారు. యజమాని చాలా సంతోషించి, అతని కూలీతో పాటు టిప్ గా మరో 500 రూపాయలు ఎక్కువ జేబులో పెట్టాడు.
జేబులో డబ్బులు ఎక్కువగా ఉండటం చూసి, ప్రీతంకు సంబరం ఆగలేదు. ఈ రోజు పండగ చేసుకోవాలి అనిపించింది. ఇంటికి వెళ్లే దారిలో, ఇంటికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరేలీ గ్రామంలో ఒక సారా దుకాణం ఉంది. అక్కడ బండి ఆపుకున్నాడు.
అక్కడ కూర్చుని ఒక హాఫ్ బాటిల్ విస్కీ తాగేశాడు. తాగిన మత్తులో, డబ్బులు వచ్చిన ఆనందంలో, తాను ఏం చేస్తున్నాడో మర్చిపోయి. బండి ఎక్కాడు. హెల్మెట్ సంగతే మర్చిపోయాడు. బండి స్టార్ట్ చేసి, ఫుల్ స్పీడ్ తో ఇంటి వైపు బయలుదేరాడు. ఈ రోజు జల్సా చేయాలనే ఆలోచన అతని బుద్ధిని తినేసింది.
ఆ రోజు పొద్దునే లిఖిత పిల్లల్ని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళింది. చాలా నెలల తర్వాత తల్లిని చూడాలని వెళ్ళింది. సాయంత్రం లోపు వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరు. ఆమె తిరిగి వచ్చేసరికి భర్త ఇంట్లో ఉంటాడని ఆశ.
ఆ పాత బ్రిడ్జి, ఆ చివరి మలుపు మరియు ఒక తల్లి కేక
ఇంటికి కేవలం ఒక్క కిలోమీటరు దూరం మాత్రమే మిగిలి ఉంది. ముందు ఒక పాత బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి చాలా ఇరుకైనది, ఒకేసారి ఒక బండి మాత్రమే వెళ్లగలదు. చీకటి పడుతోంది.
అదే సమయంలో బ్రిడ్జి అవతలి వైపు నుండి ఒక పాల ఆటో నెమ్మదిగా వస్తోంది. దాని లైట్లు వెలుగుతున్నాయి. కానీ మద్యం మత్తులో ఉన్న ప్రీతంకు ఏమీ కనిపించలేదు. కళ్లు మూసుకుపోతున్నాయి, బండి మాత్రం 80 స్పీడ్ తో దూసుకుపోతోంది.
క్షణంలో జరిగిపోయింది. ప్రీతం బండి నేరుగా వెళ్లి ఆ పాల ఆటోను ఢీకొట్టింది. పెద్ద శబ్దం . ప్రీతం గాల్లోకి ఎగిరి రోడ్డు మీద పడడం. తలకు హెల్మెట్ లేకపోవడం. తల నేరుగా సిమెంట్ రోడ్డుకు కొట్టుకోవడం. అంత కష్టం లో జరిగి అక్కడికక్కడే అతని ప్రాణం పోయింది. ఆటో డ్రైవర్ కూడా పడిపోయాడు, కానీ అతనికి పెద్దగా దెబ్బలు తగలలేదు.
చుట్టుపక్కల జనాలు పరుగెత్తుకుంటూ వచ్చారు. కానీ రక్తం మడుగులో పడి ఉన్న వ్యక్తిని చూసి ఎవరూ దగ్గరకు వెళ్ళలేదు. అందరూ గుంపుగా నిలబడి చూస్తున్నారు.
ఆ సమయంలో నేను, ఈ కథను రాస్తున్న వ్యక్తి, అదే హరేలీ గ్రామంలోని సారా దుకాణం నుండి వస్తున్నాను. నేను కూడా ఒక చిన్న బీరు తాగాను. కానీ నేను నా బండిని 30 స్పీడ్ కంటే ఎక్కువ నడపలేదు. నేను ప్రీతం దుకాణం నుండి తూలుతూ బయటకు రావడం చూశాను. నేను అతన్ని ఆపుదామని అనుకున్నాను, కానీ అతను అప్పటికే దూసుకు వెళ్ళాడు.
చీకటి ఎక్కువగా ఉండటం వల్ల నేను కొంచెం ఆలస్యంగా ఆ బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నాను. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్నది ప్రీతమే అని చూసేసరికి నా గుండె ఆగిపోయినంత పనైంది. నా ఒళ్ళంతా వణికిపోయింది. నేను బండి ఆపి కిందకు దిగి, అంబులెన్స్ కు ఫోన్ చేయండి, ఎవరైనా సహాయం చేయండి అని అరిచాను. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎంతో రక్తం పోయింది.
నేను అక్కడి నుండి కదలబోతున్న సమయంలో, ఎదురుగా నాకు ఒక దృశ్యం కనిపించింది. అది నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని దృశ్యం.
ఎదురుగా లిఖిత తన ఇద్దరు పిల్లలతో నడుచుకుంటూ వస్తోంది. పుట్టింటి నుండి తిరిగి వస్తోంది. చిన్న బాబు, పెద్ద పాప ఇద్దరూ నాన్న వచ్చేశాడు అనుకుని, ఆ బ్రిడ్జి వైపు పరుగెత్తుకుంటూ వస్తున్నారు.
బాబు గట్టిగా అరుస్తున్నాడు: నాన్న! నాన్న! ఎక్కడున్నావు?
పాప కూడా: నాన్న! అంటూ పరుగెడుతోంది.
వారికి తెలియదు, వారు ఎదురు చూస్తున్న తండ్రి ఇక లేడని. వారు దగ్గరకు వచ్చి, గుంపును చూసి, ఆ గుంపు మధ్యలో పడి ఉన్న తమ తండ్రిని చూశారు. ఆ క్షణంలో లిఖిత పెట్టిన కేక, ఆ అరుపు... ఆ అరుపును నేను ఈ జన్మలో మర్చిపోలేను. ఆకాశం చీలిపోయేలా ఉంది ఆ కేక. ఇద్దరు పిల్లలు ఏమీ అర్థం కాక అమ్మను పట్టుకుని ఏడుస్తున్నారు.
ఆ పిల్లలను చూడగానే నా కళ్ళల్లో నీళ్లు ఆపుకో లేక పోయాను. ఎందుకంటే అదే వయసులో నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల స్థానంలో నా పిల్లలను ఊహించుకునే సరికి. నా గుండె ముక్కలైపోయింది. అక్కడి నుండి నేను నేరుగా నేను బస చేసిన పెళ్లి ఇంటికి వెళ్ళాను. అక్కడ అందరూ గుసగుసలాడుకుంటున్నారు, బ్రిడ్జి దగ్గర యాక్సిడెంట్ అయ్యిందని, ఎవరో చనిపోయారని. నేను వణుకుతున్న గొంతుతో అన్నాను, అవును నేను చూశాను.
ప్రియా పాఠకులారా, ఇది కేవలం కథ కాదు. ఇది మన కళ్ళ ముందు ప్రతి రోజు జరుగుతున్న నిజం. జీవితం చాలా విలువైనది. మన శరీరంలోని ప్రతి అవయవం విలువైనది. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావడం కష్టం. ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ పెట్టి, హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తోంది అంటే, అది డబ్బు కోసం కాదు. మన ప్రాణాల కోసం. మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం.
ఒక్క క్షణం ఆలోచించండి. ఆ రోజు ప్రీతం ప్యార్యే హెల్మెట్ పెట్టుకుని ఉండి ఉంటే? మద్యం తాగకుండా ఉండి ఉంటే? 30 స్పీడ్ తో నెమ్మదిగా వచ్చి ఉంటే? ఈ రోజు అతను బతికి ఉండేవాడు. అతని పిల్లలు అనాథలు అయ్యేవారు కాదు. లిఖిత వితంతువు అయ్యేది కాదు. ఆ చిన్న గూడు అలాగే ఉండేది.
నేను, ఈ కథ రచయితగా, నా గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నాను. నేను ఆ రోజు బీరు తాగాను. నిజమే, తాగాను. కానీ ప్రీతం రక్తపు మడుగులో పడి ఉండటం, ఆ పిల్లలు నాన్న అంటూ పరుగెత్తుకు రావడం, లిఖిత కేక చూసిన తర్వాత నేను ఆ రాత్రే ఒక ప్రమాణం చేశాను. ఈ రోజు నుండి నేను ఎప్పటికీ, ఎప్పటికీ తాగి బండి నడపను అని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను మద్యం ముట్టుకుని కూడా బండి ముట్టుకోలేదు.
కాబట్టి యువకులారా, మీకు విన్నపం. మీ దగ్గర 200 సీసీ బైక్ ఉంది, యవ్వనంలో రక్తం ఉడుకుతోంది అని రోడ్ల మీద రేసులు పెట్టకండి. ఇది రేసింగ్ ట్రాక్ కాదు, ఇది ప్రజల రోడ్డు. మీ ఇంట్లో కూడా ఎవరో మీ కోసం ఎదురు చూస్తుంటారు. మీరు లేకపోతే వారి జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి.
బండిని నెమ్మదిగా నడపండి. మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ ప్రాణం కోసం. బండిని నెమ్మదిగా నడపండి.
సమాప్తం
ఈ కథ కేవలం నా ఊహతో ఊహించి రాశాను. తాత్పర్యం కేవలం రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని రాసినది, ఈ కథ కేవలం కల్పితం.
© Copyright challagali Yesudas All Rights reserved
Comments
Post a Comment