అమావాస్య అర్ధరాత్రి - పార్ట్ 2: వెంటాడుతున్న ఎర్ర చీర ఆకారం|Telugu deyyam katha
ఆందోళనకరమైన ఫోన్ కాల్ - కనిగిరి ఆసుపత్రికి పరుగు
రమణ రాత్రంతా పడ్డ ప్రయాసం తో ఒళ్లంతా నొప్పులు పుడుతుండటంతో అలసిపోయి స్నానం చేశాడు. వంటిపై నీళ్లు పోసుకుని టవల్ కట్టుకుని బయటకు రాగానే, గదిలోని బల్ల మీద ఉన్న అతని ఫోన్ పెద్ద శబ్దంతో మోగింది.
స్క్రీన్ వైపు చూస్తే కృపాల్ నుంచి కాల్ వస్తోంది. వెంటనే రమణ ఫోన్ ఎత్తి మాట్లాడాడు.
రమణ : "హా కృపాల్.. ఇంటికి చేరుకున్నా, ఏమీ ఇబ్బంది లేదు లే."
అవతలి వైపు నుంచి కృపాల్ గొంతులో తీవ్రమైన వణుకు, కంగారు స్పష్టంగా కనిపిస్తుంది.
కృపాల్ : "అయ్యో రమణా! ఆదాము ఫీల్డ్ కి వెళ్తుండగా బైక్ మీద నుండి మట్టి రోడ్డుపై జారి పడ్డాడు. కనిగిరి హాస్పిటల్‌లో చేర్చారు. నేను వెళ్తున్నా, తొందరగా రా!"
ఆ మాట వినగానే రమణ గుండె ఒక్కసారిగా గుబగుబలాడింది. ఉదయాన్నే కృపాల్ దగ్గరి నుంచి తెచ్చిన కరెంట్ వైరింగ్ సామాన్లన్నింటినీ అక్కడ పని చేసే ఎలక్ట్రీషియన్‌కు హడావిడిగా అప్పగించి.
క్షణం కూడా ఆలస్యం చేయకుండా బైక్ స్టార్ట్ చేసుకుని పరుగో పరుగు అంటూ కనిగిరి వైపు బయలుదేరాడు.
ఆసుపత్రికి చేరుకున్న రమణ ఆందోళనతో రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్లి అడిగాడు.
రమణ : "హాయ్.. ఆదాము అనే అతను ఏ వార్డులో ఉన్నాడో కాస్త చెబుతారా?"
రిసెప్షనిస్ట్ అతన్ని చూసి రిజిస్టర్ తీసింది.
రిసెప్షనిస్ట్ : "వెయిట్ చేయండి.. చూసి చెబుతాను." అని పేజీలు తిరగేసి, "హా.. ఆదాము అనే అతను H2 వార్డులో ఉన్నాడు." అని చెప్పింది.
రమణ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా అడుగులు వేస్తూ H2 వార్డు వైపు వెళ్లాడు.
H2 వార్డులో డాక్టర్ ఆదాము - బైక్ ప్రమాదం వెనుక భయంకరమైన నిజం
వార్డు లోపలికి వెళ్లగానే బెడ్ మీద కట్టుకట్టి పడుకుని ఉన్న ఆదాము కనిపించాడు. రమణ వెంటనే అతని దగ్గరకు చేరుకున్నాడు.
రమణ : "హాయ్ ఆదామ్.. అసలు ఏమి జరిగింది?"
ఆదాము ముఖంలో ఇంకా ఆ భయం తాలూకు వణుకు పోలేదు. రమణను చూస్తూ నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు.
ఆదాము : "నువ్వు.. నువ్వు.. నువ్వు చెప్పావే, అదే మట్టి రోడ్డు గుండా నేను కూడా ప్రయాణం చేస్తూ దాంతోరపల్లి లో కొంతమంది పేషెంట్లు ఉంటే వెళ్లి వాల్లని చూసి వస్తుండగా.
ఎవరో ఒక సాధారణ లేడీ లిఫ్ట్ అడిగితే బండి ఆపి ఎక్కించుకున్నాను .
కొంతసేపు బాగానే ఉంది. కానీ సగం దూరం తర్వాత ఆ లేడీ 'నువ్వే కదా రమణకి ట్రీట్మెంట్ చేసింది!' అంటూ కేక వేసింది. ఆ కేకలో పెద్ద గాలి వచ్చి బండి స్కిడ్ అయింది.
కానీ ఆమె మాత్రం మాయం అయిపోయింది అటు ఇటు పార చూసిన కనిపించలేదు.
ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండరా."
ఆ మాటలు విన్న రమణ శరీరంలో నరాలు గడ గడ వనికి పోయాయి .
ఆశ్చర్యంతో, అయోమయంతో ఆదాము వైపు చూశాడు.
రమణ : "అయినా ఆదాము.. నాకు ట్రీట్మెంట్ ఇచ్చావ్ బాగానే ఉంది, అయినా నీతో ఏంటి దానికి పని?"
ఆదాము దగ్గరే కూర్చుని కాసేపు అతన్ని పరామర్శించాడు. అదృష్టవశాత్తూ పెద్దగా తీవ్రమైన దెబ్బలేమీ తగలలేదు, అంతా నార్మల్‌గానే ఉంది. దీంతో రమణ స్వయంగా ఆసుపత్రి ఫార్మాలిటీస్ పూర్తి చేసి, ఆదామును డిశ్చార్జ్ చేయించుకుని తన బైక్ మీదే జాగ్రత్తగా అతని ఇంటికి తీసుకెళ్లి దించాడు.
కొత్త ఇంట్లో భయానక అనుభవం - కళ్లముందు కదిలిన ఎర్రటి ప్రతిబింబం
ఆదామును ఇంట్లో క్షేమంగా విడిచిపెట్టిన తర్వాత, రమణ తిన్నగా ఊర్లోని తన కొత్త ఇంటికి వచ్చాడు.
నిర్మాణంలో ఉన్న ఆ ఇంటి మిద్దె పైన ఒక పాత మంచం వేసుకొని.
గత రాత్రి నుంచి జరుగుతున్న విచిత్ర సంఘటనలన్నింటినీ మనసులో నుంచి తీసేసి, ఒంటికి విశ్రాంతి ఇవ్వాలని కళ్లు మూసుకున్న. కాసేపటికే గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
సరిగ్గా అతడు మంచి నిద్ర మత్తులో ఉండగా...
ఎవరో ఒక స్త్రీ తన చెవుల దగ్గరకు వచ్చి అదొక రకంగా విచిత్రంగా
"రమణా లే...!"
అంటూ గట్టిగా కేక వేసింది.
ఆ కర్ణకఠోరమైన అరుపు వినగానే రమణ గుండె ఝల్లుమని ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.
నిద్ర మత్తులో, కంగారులో చుట్టూ చూశాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఏమీ అర్థం కాక, బహుశా పీడకల వచ్చిందేమోనని సరిపెట్టుకుని మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు.
మరుసటి రోజు ఉదయం రమణకు ఒళ్లంతా విపరీతమైన నొప్పులు మొదలయ్యాయి. శరీరం సహకరించడం లేదు.
"ఏంట్రా.. మొన్నటి నుండి నా జీవితంలో అసలు ఏమి జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు.." అని మనసులోనే తనతట తానే అనుకోసాగాడు.
కష్టపడి లేచి స్నానం చేసి, టిఫిన్ తిని, ఇంట్లోని దేవుడి మూలన నిలబడి చేతులు జోడించి దండం పెట్టుకున్న.
అనంతరం తన కొత్త ఇంటి పనులను పర్యవేక్షించడం మొదలుపెట్టాడు. ఒక గదిలో గోడలకు పుట్టీ పని చేస్తున్నారు. మరో గదిలో ఎలక్ట్రీషియన్లు కరెంట్ వైర్లు లాగుతున్నారు.
రమణ హాల్ గుండా నడుచుకుంటూ బయటకు వెళ్తుండగా...
సడన్‌గా ఎవరో ఎర్రటి ఆకారం, ఒక ఎర్రటి ప్రతిబింబం అతని కళ్లెదురుగా మెరుపులా దూసుకుపోయినట్లు అనిపించింది!
ఇక రమణకు సమస్య తీవ్రత అర్థమైంది. తాను ఆ దారిలో పడిపోవడం.. అదే దారిలో ఎర్ర చీర స్త్రీ లిఫ్ట్ అడగడం.. ఆ తర్వాత ఆదాముకు కూడా ప్రమాదం జరగడం.. రాత్రి చెవిలో కేక.. ఇప్పుడు కళ్లెదుటే ఎర్రటి రూపం!
ఏదో తెలియని, అర్థం కాని దుష్టశక్తి తమ వెంటే తిరుగుతోందని గ్రహించి, తీవ్రమైన భయంతో తన స్నేహితుడు ఆదాముకు ఫోన్ చేశాడు.
శ్రావ్య, ఆదాములతో సంభాషణ - ఫకీరు ఇచ్చిన నిమ్మకాయల నిబంధన
ఫోన్ రెండు రింగులు మోగగానే అవతలి వైపు నుంచి ఆదాము భార్య శ్రావ్య లిఫ్ట్ చేసింది.
శ్రావ్య : "హా చెప్పండి రమణ గారూ.."
రమణ : "ఏమీ లేదు శ్రావ్య.. ఆదాముకి కాస్త కాల్ ఇవ్వవా, మాట్లాడాలి."
శ్రావ్య : "ఆయన స్నానానికి వెళ్లారు. ఏమైందో చెప్పండి, నేను చెప్తాను ఏమైనా అర్జెంట్ అయితే."
రమణ : "హా ఏమీ లేదులే.. బయటకు వచ్చాక కాల్ చేయమని చెప్పు."
శ్రావ్య : "హా సరే చెప్తాను."
రమణ ఫోన్ పెట్టేసి వేచి చూస్తున్నాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఆదాము కాల్ చేశాడు.
ఆదాము : "ఏంటి రమణా.. కాల్ చేశావంట?"
రమణ : "ఏమీ లేదురా.. జరిగేదంతా చూస్తుంటే ఏదో ఉన్నట్టు, మన ఇద్దరి చుట్టూ తిరుగుతున్నట్టే అనిపిస్తుంది."
ఆదాము : "అవును.. నాకు కూడా అలాగే ఉంది. శ్రావ్యకేమీ చెప్పలేదు కదా నువ్వు? తనకి ఈ విషయాలేమీ తెలియవు."
రమణ : "లేదు.. నేనేమీ చెప్పలేదు."
ఆదాము : "అయితే ఈ రోజు ఒక పని చేద్దాం."
రమణ : "ఏమి చేద్దాం?"
ఆదాము : "నేను ఇక్కడ ఉన్న ఒక ఫకీరుకి చెప్పాను. అతను రెండు నిమ్మకాయలు కుంకుమలో ముంచి, పసుపు రాసి నాకు ఇచ్చాడు. ఒకటి నా దగ్గర ఉంది, ఇంకొకటి నీకోసం తీసుకొని వస్తున్నా.. ఆగు, ఇంట్లోనే ఉండు. ఇవ్వాళ నువ్వు ఎక్కడికీ వెళ్లకు."
అలా చెప్పిన కొద్దిసేపటికే ఆదాము ఆ నిమ్మకాయను చేతబట్టుకుని నేరుగా రమణ ఇంటికి చేరుకున్నాడు. కుంకుమ, పసుపుతో ఎర్రగా మారిన ఆ నిమ్మకాయను రమణ చేతికి ఇస్తూ ఇలా హెచ్చరించాడు:
ఆదాము : "ఈ నిమ్మకాయని మనం ఇద్దరం తల కింద పెట్టుకుని మూడు రాత్రులు బయట ఎక్కడా తిరగకుండా ఈ నిమ్మకాయతోనే ఉండాలి. కానీ ఒక చీకటి గదిలో మన చుట్టూ ఎవరూ ఉండకూడదు. ఈ నిమ్మకాయని ఎవరూ చూడకూడదు. మూడు రాత్రులు తప్పకుండా ఈ నిమ్మకాయ రాత్రి వేళ మన తల కింద, పగటి వేళ మన మొలతాడుకి ఉండాలి!"
అని గట్టిగా చెప్పి ఆదాము అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
చేతిలో ఉన్న ఆ నిమ్మకాయను చూస్తున్న రమణ గుండెల్లో తెలియని భయం మొదలైంది. ఆ మూడు రాత్రులలో వారిద్దరికీ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురుకానున్నాయో కాలమే సమాధానం చెప్పాలి...
(మిగతా భయంకరమైన కథను తర్వాతి భాగంలో చదవండి...)
© Copyright 2026 challagali Yesudas All Rights reserved
Comments
Post a Comment