ది స్ట్రీట్ లైట్ part 4 ( the street light)

"గమనిక: ఈ కథ పూర్తిగా కల్పితం. ఇందులో ఉన్న పాత్రలు, పేర్లు, స్థలాలు మరియు సంఘటనలు రచయిత ఊహ నుండి పుట్టినవి మాత్రమే. ఇది ఏ ఒక్క వ్యక్తిని, కులాన్ని, మతాన్ని, వ్యవస్థను లేదా ప్రభుత్వ కార్యాలయాన్ని ఉద్దేశించి రాసినది కాదు. వాస్తవ జీవితంతో పోలికలు ఉంటే అవి కేవలం యాదృచ్ఛికం మాత్రమే. సమాజంలోని అవినీతిపై అవగాహన కొరకు కర్మ సిద్ధాంతం ఆధారంగా రాసిన కథ ఇది."



 అఖండ మరియు అంతంత విశ్వం లో చేరిన లేఖలు


అఖండ మరియు అంతంత విశ్వం లో చేరిన లేఖలు



ఆమె రేషన్ కార్డ్  సమస్య తరవాత ఆ ఆఫీస్ లో పని చేసే వాళ్ళు
 అందరూ లంచాలను పంచుకోగా ఆ తదుపరి పొలం పాస్ బుక్స్ చేయించు కోవడం కోసం వొచ్చిన,, పొలం  పట్టాల కోసం వెళ్ళిన ఆ ఆఫీస్ లో లంచాలు తీసుకునే వ్యవహారం విద్ధి విధానం ఆకాశం అంటింది .

 విరిగిన మనసులు బాధ పడే  వారి  లెక్క ఆ ఆఫీస్ లో రాజా రామ్ లాంటి ఎంతో మంది పడుతున్న ఇబ్బంది
 అక్కడే కూర్చున్న రాజా రామ్  ప్రతి ఒక్క విషయం చూస్తూ తన నోట్ బుక్ లో రాస్తూ నే ఉన్నాడు.

ఎవరో ఒక నిరుపేద వ్యక్తి   వాళ్ల ముత్తాతల దగ్గర నుండి 15 సెంట్ల భూమి వారసత్వం కింద అతనికి చెందితే అతను ఆ పొలం తాళ్లకు  పాస్ బుక్ చేయించు కుందాము అని వెళ్లితే 15 సెంట్ల భూమి కి 25000 లంచం అడిగాడు ఆ ఆఫీస్ బాయ్ అతను పాపం ఎంత పేదరికం లో ఉన్న వ్యక్తి ఐతే కదా 15 సెంట్ల భూమి కోసం ఆఫీస్ చుట్టూ 
తీరుతాడు 

ఇవన్నీ నెలకు ఒక్క సారి జీతం తీసుకొని నెల మొత్తం జనాలని దోచుకునే వాళ్ళకి ఎలా అర్థం అయితది అసలు సర్కారు వేలకు వేలు జీతం ఇచ్చి ఏసీ రూమ్ లో కూర్చో బెడితే వాళ్ళేమో 

అదే ప్రజలను దుబారుగా దోచుకుంటూ రాజా రామ్ లాంటోల్లని వేధిస్తూ ఉన్నారు 

ఈ విషయాలు అన్ని స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చూస్తూ తన బుక్రా లో రాసేసి  ఆ రాత్రికి బాగా నిద్ర పట్టించాడు

ఆ నిద్ర లో రాజా రామ్ చేరుకున్న మల్టీ యూనివర్స్ నుండి అతని నోట్ బుక్ లోకి 

ఒక భయంకర క్రూర దరిద్ర భక్షణ ఆవిరి రాజా రామ్ మేధస్సు శక్తి ద్వారా యూనివర్స్ నుండి అతని నోట్ బుక్ లోకి చొరబడి పోయింది

ఆ భక్షణ ఆవిరి రాజా రామ్ రాసిన ప్రతి మాట ను అక్షరం తప్పక చదివేసింది రాజా రామ్ తో పాటు నెల మీదకు దిగిన 

ఆ భక్షణ ఆవిరి ..

    నోట్ బుక్కు నుండి జేబు లో ఉన్న పచ్చని నోట్  లోకి


నోట్ బుక్కు నుండి జేబు లో ఉన్న పచ్చని నోట్  లోకి



ఆ భక్షణ ఆవిరి వీరి మల్టీ యూనివర్స్ నుండి రాజా రామ్ నోట్ బుక్ వరకు రాజా రామ్ నోట్ నుండి  ఆ పాస్ బుక్ వాళ్ళు ఇచే డబ్బు నుండి ఆ విధవరాలు  పడే బాధ వరకు 

చనిపోయిన ఆ పెద్దాయన బాధ అందరిని చూసింది చదివింది 
సమాజానికి సిగ్గు చేటు  గా మారిన ఆ లంచాలు తీసుకునే ఆ మోసగాళ్లను రాజా రామ్ నోట్ బుక్ నుండి వాళ్ళు తీసుకున్న ఆ కరెన్సీ నోట్ లలో చొరబడి పోయింది  ఆ ఆఫీస్ బాయ్ ఎంత డబ్బు ఐతే లంచంగా తీసుకుని తన 

బీరువా లో దాచుకున్నాడో ఆ డబ్బు అంతటి లో ఆ భక్షణ ఆవిరి వ్యాపించింది  ఎవరెవరూ ఆ ఆఫీస్ లో ఎంత ఎంత అక్రమంగా తీసుకుంటున్నారు అంతటిలో ఆ భక్షణ ఆవిరి రాజా రామ్ నోట్ బుక్ నుండి బయటకు వెళ్ళి ఆ లంచం  కరెన్సీ లో చొరబడడం స్టార్ట్ చేసింది 

ప్రతి రోజు ఉదయం రాజా రామ్ నోట్ బుక్ నుండి బయటకి చేరి  రాజా రామ్ పక్కనే కూర్చొని అక్కడ జరిగే అక్రమాలను చూస్తూ అక్కడ విచ్చల విడిగా వారు దోచుకునే కరెన్సీ లోకి చొరబడి పోతుంది ఆ భక్షణ ఆవిరి 

అంతటితో ఆగకుండా ప్రతి ఒక్క రూపాయ నుండి పెద్ద నోట్ వరకు ఆ ఆవిరి చోర బడి పోతూనే వొస్తుంది మెల్లగా మెల్లగా ఆ 
భయంకర క్రూర దరిద్ర భక్షణ ఆవిరి ప్రతి ఒక్కరి బాధల్లో , కన్నులలో లంచంగా ఇచే కరెన్సీ నుండి తీసుకుని వారి బీరువా వరకు చేరుతూనే ఉంది .

                    దేవుడు చేసిన ప్రతి కారం


దేవుడు చేసిన ప్రతి కారం



భక్షణ ఆవిరి ఆ ఆఫీస్ బాయ్ కరెన్సీ నుండి బయటకి ఒచ్చి ఆఫీస్ అమ్మ గారిని తాకింది వెంటనే ఆఫీస్ బాయ్ వాళ్ళ అమ్మ గారికి సడన్ స్ట్రోక్ ఆఫ్ పారలైజ్ ఎటాక్ వెంటనే ఆఫీస్ బాయ్ వాళ్ళ అమ్మ గారిని అర్జెంట్ గా అంబులెన్స్ లో తీసుకొని ఫుల్ కార్పొరేట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళి పోయాడు అక్కడ 

డాక్టర్స్ నర్సెస్ అందరూ హడా విడిగా ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని 3 లక్స్ బిల్లు చేశారు ఆ భక్షణ ఆవిరి అక్కడే వాళ్ళ అమ్మగారి దగ్గిరే ఉంది నవ్వుతూ ఉంది 

ఇంతలో డాక్టర్ వొచ్చి ఒక పెద్ద మందుల లిస్ట్ చేతిలో పెట్టాడు 
ఆఫీస్ బాయ్ ఆ లిస్ట్ తీసుకొని కౌంటర్  దగ్గర బిల్లు చూసి షాక్ అయ్యాడు అక్కడ కేవలం మందుల బిల్లు హాస్పిటల్ బెడ్ బిల్లు 3 లాక్స్ అయింది ఇదేంటి అని 

కౌంటర్ లో అడిగితే వాళ్ళు ఆమెకు వొచ్చిన జబ్బు అలాంటిది అందుకే ఈ మందులు చాలా ఖరీదైనవి అని అన్నాడు

సరే అని బిల్లు కట్టి డాక్టర్ కేబిన్ కి ఆఫీస్ బాయ్ వెళ్ళి విషయం అడిగినప్పుడు అక్కడ డాక్టర్ అయ్యా మీ అమ్మ గారికి హార్ట్ లో హోల్ ఉంది దాని వల్ల ఎక్కువ కంగారు పడింది అందుకు కంగారు పడడం వల్ల శరీరం లో బలహీనత ఏర్పడి నరాలు వీక్ అవ్వడం వల్ల 

ఆమెకి paraliaze ఎటాక్ ఒచ్చింది 7 మంత్స్ మెడిసిన్స్ వాడాలి మెడిటేషన్ చేయాలి ఆ తరవాత బాడీ కండిషన్ చూసి హార్ట్ ఆపరేషన్ చేయాలి 

దీని ఖర్చు కనీసం ఓ 50 లక్షల దాకా అయ్యింది అని చెప్పాడు 
ఇక అంతే ఆ ఆఫీస్ బాయ్ అక్కడిక్కడే స్రృహ తప్పి పడిపోయాడు అక్కడ ఉన్న వాలు ఆ ఆఫీస్ బాయ్ నీ పైకి లేపి నర్స్ లు డాక్టర్ లు బ్లడ్ టేస్ట్ చేసి చూస్తే 

అతనికి కూడా హై బీపీ హై షుగర్ అని తేలింది డైలీ టాబ్లెట్ ఇంజెక్షన్స్ వేసుకోక పోతే కష్టమే అని డాక్టర్ కూడా తేల్చి చెప్పేశారు

ఇక ఈదురు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తుండగా అప్పుడే ఆ విధవ రాలు అనుకో కుండా అదే హాస్పిటల్ లో ఆ ఆఫీస్ బాయ్ కి ఎదురైంది 
ఆమె ఆ ఆఫీస్ బాయ్ నీ ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు ఆఫీస్ బాయ్ ఇలా ఇలా జరిగింది అని చెప్పగా 

ఆమె ఇలా అన్నది అయ్యా నేను ముందే చెప్పాను కదా దేవుడు ప్రతి మనిషి కి కర్మ ఫలం ఇస్తాడు అని అనగా ఆ ఆఫీస్ బాయ్ 

ఏదో ఆలోచన లో పడి వెళ్ళి పోయాడు పోతూ పోతూ అతను తీసుకున్న మొత్తం లంచం లెక్క వేసి చూస్తే అతను డాక్టర్ చెప్పిన అమౌంట్ రెండు ఒకేలా ఉన్నాయి ......... ఆఫీస్ బాయ్ కి ఆ స్ట్రీట్ లైట్ లో నుండి బయటకి వొచ్చిన  భయంకర క్రూర దరిద్ర భక్షణ ఆవిరి అతని కర్మ ఫలం అతనికి ఇచ్చేసింది... 


 

ఆఫీస్ లో ఉన్న పై అధికారులకు కూడా కర్మ ఫలం తప్పదు


ఆఫీస్ లో ఉన్న పై అధికారులకు కూడా కర్మ ఫలం తప్పదు



అప్పటికి కూడా ఆఫీస్ బాయ్ మారలేదు అతని అరాచకం మారలేదు అలా అని ఆ స్ట్రీట్ లైట్ యొక్క మల్టీవర్స్ నుండి రాజా రామ్ తీసుకు వొచ్చిన  ఆ  భయంకర క్రూర దరిద్ర భక్షణ ఆవిరి  కూడా అలాగే వొదల లేదు

భయంకర క్రూర దరిద్ర భక్షణ ఆవిరి తన పని ఆ లంచం అనే కరెన్సీ లో నుంచి బయటకి వస్తూనే  ఉంది 

ఈ సారి  అతని పై అధికారి కుటుంబంలో అతనికి ఉన్న ఏకైక నానా గారిని టార్గెట్ చేస్తూ ఆ పై అధికారి వాళ్ళ నానా గారు ఇద్దరు సరదాగా కార్లో హైవే మీద లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉండగా హఠాత్తుగా కార్ కి ఎదురుగా 

ఒక పెద్ద లారీ ఎదురు వొచ్చి స్పీడ్ కంట్రోల్ చేసుకో లేక అధికారి యొక్క కారు నీ గట్టిగా డీ కొనడం తో అక్కడే ఇద్దరు స్రృహ లేకుండా పడిపోయి ఉన్నారు 

అదే సమయంలో యం ఆర్ ఓ ఆఫీస్ గడప దగ్గర చనిపోయిన ఆ పెద్దాయన ఆత్మ స్రృహ తప్పిపోయిన అధికారిని వాయువు యొక్క ఫ్రీక్వెన్సీ ద్వారా లేపి అతని కారు అద్దం మీద 

కర్మ ఫలం ఎవ్వరిని విడిచి పెట్టదు ఇప్పటికైనా మారండి 
అని రాసి మాయం అయిపోయాడు

నెక్ట్ మినిట్ ఆ అధికారి లేచి అతని నాన్న గారిని అంబులెన్స్ పిలిచి అదే కార్పొరేట్ ఆఫీసు కి తీసుకెళ్తాడు 

సడన్ గా డాక్టర్స్ ఇద్దరిని తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తారు అధికారి కి జనరల్ దెబ్బలు అయిన 

వాళ్ళ నాన్నగారికి మాత్రం పెద్ద ఎత్తున భారీ గాయాలే అవ్వడం వల్ల  అన్ని ఆపరేషన్స్  కి భారీ ఎత్తున ఖర్చు అయింది అధికారి వాళ్ళ నాన్న గారికి బోర్న్ మరో అండ్ సిరియస్ stomch ఇంజురీ అవ్వడం వల్ల ఆ కార్పోరేట్ హాస్పిటల్ లో 

45 లక్షల ఖర్చు అయింది అధికారి ఆ కారు మీద ఉన్న ఆ రాతల గురించి ఆలోచిస్తూ కార్ డ్యామేజ్ హాస్పిటల్ బిల్లు చూసుకోగా అధికారి అక్రమంగా సంపాదించిన సంపాదన ఇప్పుడు జరిగిన డ్యామేజ్ రెండు ఒకటే కాల్యులేషన్ రావడం 

అతని నేత్రాలు తెరవబడ్డాయి 
కానీ కొన్నాళ్లకు మల్లి అతను యథా విధీ గా మరల మారి.పోయాడు

ఇలా ఆ ఆఫీస్ లో ఉన్న చిన్న అధికారి నుండి పై అధికారి వరకు జరగడం తో అందరూ ఏమి అర్ధం కాని అయి మయంలో ఉన్నారు

ఇది ఇలా ఉన్న కూడా వాళ్ళు చేసిన అన్యాయాలు వాళ్లకి అర్థమైన కూడా కొంత కాలం మంచిగా ఉండి మళ్ళీ మొదటి లాగే చేయడం మొదలు పెట్టారు 

   చివరి న్యాయం మల్టీ యూనివర్స్ ఎవరిని ఓదలలేదు 

చివరి న్యాయం మల్టీ యూనివర్స్ ఎవరిని ఓదలలేదు



వాళ్ళు మారిన ప్రతి సారి రాజా రామ్ పెన్ను రాయడం యూనివర్స్ మూలంగా స్ట్రీట్ లైట్ వేలగడ్ ఆ 
భయంకర క్రూర దరిద్ర భక్షణ ఆవిరి
రాజా రామ్ నోట్ బుక్ నుండి బయటకి రావడం మరల వారిని ఏదో ఒక విధంగా దండించడం 
ఆ ఆవిరి దండిస్తుంది కానీ ఎవరికి కూడా ప్రాణ హాని చేయలేదు

రాజా రామ్ వాళ్ళ అత్త మామ లో ఇవన్నీ చూసి వారి హృదయం లో భయం ఏర్పడి వాళ్ళు మాత్రం లోలోపల మార్పు చెంది ఒక పశ్చాతాపం తో రాజా రామ్ రామ్ కోసం అతని దగ్గరికి వచ్చి రాజా రామ్ ఇల్లు నిధి మా వాళ్ళ పొరపాటు ఐపోయింది పద ఇంటికి నీ ఇల్లు నీదే  పద నీ ఇంటికి నువ్వు నీకు మేము ఉన్నాము అన్నారు 

కానీ రాజా రామ్ ఇప్పుడు ఈ లోకానికి సంబంధించిన వ్యక్తి కాదు క బట్టి అతను వారి వైపు చూసి 

మీరెవరు నాకు తెలియదు మీరు చెప్పే మాటలు నాకు అర్థం కావట్లేదు అని చెప్పాడు కానీ వారు ఇద్దరు పది పది బతిమాలిన 

రాజా రామ్ రాక పొగ రాజా రామ్ కోపడం తో వల్ల అత్త మామ చేసేది ఏమి లేక అక్కడ నుండి వెళ్ళి పోయారు

                           చివరి న్యాయం    

చివరి న్యాయం



వారు ఆ ఆఫీస్ లో అక్రమాలు చేయడం మారలేదు రాజా రామ్ తన నోట్ లో రాయడం మానలేదు ఆ  భయంకర క్రూర దరిద్ర భక్షణ ఆవిరి దండిచం మనలేదు 
కానీ ఈ సారి మల్టీ యూనివర్స్ కి చివరి కోపం ఒచ్చింది ఆ ఆవిరి ఆ అధికారులందరికీ చివరి న్యాయంగా ఆఫీస్ లో ఉన్న అందరికీ పర్మినెంట్ ఫిజికల్ డ్యామేజ్ ఇచ్చేసింది 

ఈ విషయం అంత కథలు కథలు గా ఆ జిల్లా మొత్తం వ్యాపించి పోయింది అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ రాజా రామ్ కి జరిగిన అన్యాయం ఆ జిల్లా కలెక్టర్

ఛాంబర్ వరకు చేరింది కలెక్టర్ వ్యతి చాలా మంచి వ్యక్తి కావడం వల్ల ఎమ్మటే పూర్తి అధికారంతో యం ఆర్ ఓ ఆఫీస్ కి చేరుకొని అందరిని డిస్మిస్ చేసి నీతి న్యాయం తెలిసిన కొత్త అధికారులను నియమించి 

రాజా రామ్ ఉన్న ఆ స్ట్రీట్ లైట్ దగ్గరికి చేరుకునే లోపు 

రాజా రామ్ చివరి శ్వాస విడిచి ఆ మల్టీ యూనివర్స్ లో కలిసిపోయాడు  

కలెక్టర్ గారు రాజా రామ్ రాసిన ఆ నోట్ బుక్ మొత్తం అక్కడ కూర్చొని చదివి అతని జీవిత లో జరిగిన విషాదం మొత్తం తెలిసాక చాలా బాధ పడి క3పూ కన్నీలు విడిచి

అదే ఆఫీస్ మధ్యలో అతను రాసిన ఆ నోట్ నీ కంప్లీట్ గా ఓపెన్ గా అక్కడ పెట్టీ 

కొత్తగా ఈ ఆఫీస్ లోకి చేరిన అధికారులు మొట్ట మొదట ఆ నోట్ బుక్ చదివిన తరవాతే విధులలో చేరాలనే ఒక్క కొత్త రూల్ పెట్టాడు 

రాజా రామ్ వాళ్ళ అత్త మామ ఏడుస్తూ ఒచ్చి రాజా రామ్ ఇల్లు ఎంత ఖరీదు చేస్తుంది అంత డబ్బు ఆ స్ట్రీట్ లైట్ ల్యాండ్ యజమాని కి చెల్లించి అక్కడే ఒక పెద్ద గుడి లాగా సమాధి కట్టించారు

కానీ భయంకర క్రూర దరిద్ర భక్షణ ఆవిరి మాత్రం ఇప్పటికీ అక్కడే ఆ ఊరిలో ఇంకో రాజా రామ్ లాగా ఎవరికి అన్యాయం జరగ కూడదు అని అక్కడే ఉండి పోయింది ఎవరు అక్రమంగా కరెప్షన్ చేసిన ఇప్పుడు కూడా ఆ ఆవిరి కర్మ ఫలం విధంగా అయిన సరే కచితనగా కర్మ ఫలం ఇస్తుంది 

ఇప్పటికీ కూడా మన దేశం లో ఈ లంచం వల్ల దేశ సేవ లో చేరాలనుకునే ఎంతో మంది రాజా రామ్ లాంటోలు నిరాశ తో 

ఒకటి చనిపోవడం లేదా డైలీ కూలీలాగా మిగిలి పోతున్నారు 

ఈ కథ నేను ఊహించుకొని రాసిన రఘు పతి రాఘవ రాజా రామ్ కి హృదయంతో అంకితం.

©Copyright challagali yesudas all rights reserved 









 

Comments

Popular posts from this blog

పాత టంకు పెట్టె (Part 1)

LAST CIGARETTE (లాస్ట్ సిగరెట్) - భాగం 1

​విరిగిన గడియారం (Tuti Hui Ghadi)