ది స్ట్రీట్ లైట్ part 3 (the street light)
గమనిక: ఈ కథ కేవలం కల్పితం మరియు పాఠకుల వినోదం కోసం మాత్రమే రాయబడింది. ఇది ఏ ఒక్కరి నమ్మకాలను లేదా భావాలను నొప్పించడానికి ఉద్దేశించినది కాదు.
స్ట్రీట్ లైట్ తో జీవనం
మల్టీ యూనివర్స్ లో ప్రయాణం చేస్తున్న రాజా రామ్ ఇక మనుషుల లోకం తో ఎటువంటి సంబంధం లేకుండా తనదంటూ ఒక కొత్త ప్రపంచంలో ఉన్నాడు ఆ స్ట్రీట్ లైట్ కింద కూర్చొని అక్కడే ఉన్న బోరింగ్ నీళ్ళు తాగుతూ ఎవరైనా పాపం తలచి ఇచ్చినది తిని అక్కడే ఆ స్ట్రీట్ లైట్ కింద కూర్చొని నిద్ర పోవడం మరల మల్టీ యూనివర్స్ లో తెలిపతి సిగ్నల్స్ ద్వారా అనంత విశ్వం లో మాయమై పోవడం యధా విధి గా మరల ఉదయాన్నే లేవడం ఇలాగే కొనసాగి పోతూ రాజా రామ్ తన గతాన్ని తన జీవితాన్ని తనలో మిగిలి ఉన్న మంచి చెడు
చేదు తీపి మొహం వ్యామోహం ఆశా నిరాశా ,, సమస్తం మర్చిపోయాడు ఇప్పుడు అతనికి తెలిసిందల్లా ఒక్కటే స్ట్రీట్ లైట్ కింద కూర్చోవడం ఆ నోట్ మీద పెన్ను పెట్టీ నిద్ర పోవడం ఉదయం మరల లేవడం అతను ఇప్పుడు ఈ ప్రపంచం తో ఎటువంటి సంబంధం లేని వాడిలా ఆ లైట్ కింద తన జీవితం అంత అలాగే బతికేయాలి అన్నట్టు అక్కడే ఉండిపోయాడు మిలట్రీ కల తన ఇంటి గురించి స్నేహితుల గురించి ప్రియురాలి అన్ని మర్చిపోయాడు అతనికి ఇప్పుడు ఒక్క విశ్వం స్ట్రీట్ లైట్ ఆ నోట్ బుక్ ఆ ఆఫీస్ తప్ప మరేమీ గుర్తు లేదు
పెద్దాయన వృధాప్య పెన్షన్
ఇది ఇలా ఉండగా మరుసటి రోజు ఉదయం 10 గంటలకి ఒక 68 సంవత్సరాల పెద్దాయన mro ఆఫీస్ వెళ్లి అక్కడ ఉన్న ఆఫీసు బాయ్ నీ
పెద్దాయన: అయ్యా గత 6 నెలలుగా నాకు వృధాప్య పెన్షన్ రావడం లేదు నేను ఎదురు చూసి చూసి ఇక నా వల్ల కాక అసలేమైంది తెలుసుకోవాలని వచ్చినాను కొంచెం చూసి ఎందుకు రావట్లేదు చెప్తారా అన్నాడు
ఆఫీస్ బాయ్ : పెద్దాయన మీ పేరు మీద మీకు తెలియకుండా డెత్ సర్టిఫికెట్ జారి చేయబడింది కానీ మీరేమో ఇప్పుడు వచి పెన్షన్ గురించి అడుగుతున్నారు అయ్యా మా సిస్టమ్ లో మీరు జీవించి లేరు అని చూపిస్తుంది అయ్యా ఇంటికి వెళ్ళండి మీరు ప్రభుత్వ దృష్టిలోనే లేనప్పుడు మీకు పెన్షన్ ఎలా వొస్తుంది
పెద్దాయన : అయ్యా అలా అనొద్దు అయ్యా మరొక సారి చూడండి అయ్యా
ఆఫీస్ బాయ్ : ఒక్క సారి చూసిన అదే 100 సార్లు చూసిన అదే దిన్ని మార్చడం అయ్యే పని కాదు వెళ్ళండి అయ్యా
పెద్దాయన : అయ్యా చూడండి అయ్యా నాకంటూ వెనక ముందు అన్నం పెట్టే వారు ఎవరు లేరు మీరు ఇచ్చే ఈ నాలుగు కాసులే నా జీవన ఆధారం అంటూ బతిమి లాడాడు అయ్యా మీకు దండం పెడుతున్న చూడదండి అయ్యా అని బతిమిలాడాడు
ఆఫీస్ బాయ్: సరే పెద్దాయన ఒక 10000 ఇవ్వండి మొత్తం సరిచేస్తాను
పెద్దాయన : అయ్యా అంత డబ్బు ఉంటే మీ దగ్గర కి వొచ్చి నేనెందుకు ఇలా చేతులు చాపుతాను అంటూ బయటికి వెళ్తూ వెళ్తూ ఆఫీస్ గడప దగ్గరే అతని గుండె ఆగి చనిపోతాడు
ఆఫీస్ బాయ్ అతని శవాన్ని మున్సిపాల్టీ వాళ్ళకి ఒప్ప చెప్తూ ఇలా అంటాడు తీసుకెళ్ళండి ఈ అనాథ శవాన్ని అంటూ చెప్పాడు మున్సిపాల్టీ వాలు వొచ్చి అతని శవాన్ని కాల్చేదాం అంటూ తీసుకెళ్తూ మధ్యలో అతని జేబులు చూస్తారు కానీ అతని జేబు లో చిల్లి గవ్వ కూడా దొరలేదని అతనిని కాల్చకుండా అక్కడే కాలువలో పడేసి వెళ్ళి పోతారు
ఇదంతా చూస్తున్న రాజా రామ్ అక్కడ జరిగింది జరిగినట్టే తన చేతుల్లో ఉన్న నోట్ బుక్ లో రాస్తున్నాడు
విధవరాలు రేషన్ కార్డ్ లో కరెక్షన్స్
మరుసటి రోజు మరల అదే సమయానికి ఒక భర్త లేని 30 సంవత్సరాల ఆమె అదే ఆఫీస్ కి ఒచ్చి
ఆమె : సారు నా భర్త చనిపోయి ఒక సంవత్రం అయింది ఆయన చనిపోయాక ఆయనని రేషన్ కార్డ్ నుండి తీసేశారు కానీ ఆయన పేరు తో పాటు నా కొడుకు 6 ఇయర్స్ పిల్లోడి పేరు కూడా డిలీట్ అయిందని స్కూల్ లో చేర్చుకోవడం లేదని సర్కార్ వారి స్కూల్ కావడం తో చేర్చడానికి చాలా ఇబ్బందులు ఎదురు ఐతునాయి సారు కొంచెం సరి చేయండి సారు అని అర్జీ తీసుకొనినోచింది
ఆఫీస్ బాయ్ : అమ్మ మీరు చెప్పే రేషన్ కార్డ్ నేమ్ యాడింగ్ ఇప్పుడు కాదు ఆ సైట్ ఇంకా ఓపెన్ కాలేదు వొచ్చే సంవత్రం ఆ సైట్ ఓపెన్ అయ్యాక చెప్తాము అప్పుడు రండి అమ్మ పిల్లోడి పేరు ఎక్కిస్తాము అన్నాడు
ఆమె : సారు ఒక సంవత్రం అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది సారు ఒక్క సంవత్రం స్కూల్ లేట్ అయిపోతుంది పిల్లోడి చదువు భంగం అయిపోతుంది సారు చూడండి సారు మీరు అనుకుంటే అయితది సారు
ఆఫీస్ బాయ్: అమ్మ మేము ఏమి చేయలేము ప్రభుత్వం రేషన్ కార్డ్ యాడింగ్ సైట్ ఒదిలి నప్పుడే మేము చేయగలము సైట్ ఓపెన్ కాకుండా చేయలేము మా చేతుల్లో ఏమి లేదు
ఆమె: సారు 4 కిలోమీటర్ల నుండి నడిచి ఓచానయ్య చుడండి అయ్యా మరల మరల నేను ఇంత దూరం కాలి నడకన రాలేను ఒక సారి చూడండి సారు
ఆఫీస్ బాయ్ : సరే సరే చూస్తాము ఆ అప్లికేషన్ అక్కడ పెట్టీ ఓ 1000 రూపాయలు ఇచి పో అన్నాడు
ఆమె : సరే సారు నా పని ఐతే చాలు మరల మరల తిరిగే కన్నా డబ్బులు ఇవ్వడం మేలే కదా అంటూ ఇవిగోండి సారు 1000 రూపాయలు అంటూ డబ్బులు ఇచి
ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి పోయింది
డబ్బు ఇచ్చిన వ్యర్ధమే
ఆ 1000 తీసుకున్న ఆఫీస్ బాయ్ ఇంకా ఆ రోజు వొచ్చిన డబ్బు మొత్తని ఆఫీస్ లో ఉన్న అందరికీ పంచాడు సాయంత్రం కళ్ళ
ఎవరికి చెందాల్సినవి వారికి భాగాల చొప్పున అందరికీ డబ్బు సెటిల్ చేసి ఇంటికి వెళ్ళి పోయాడు
కింద నుండి పై వరకు ఎంత మంది ఉన్నారో అందరూ అక్రమంగా ఇచిన డబ్బు తో సంతోషంగా ఇంటికి వెళ్లారు ఇది ప్రతి రోజు జరిగే విషయమే ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంత లంచం ఒస్తుందో అవి సాయంత్రం అందరికీ పంచేస్తాడు ఆ ఆఫీస్ బాయ్
కానీ మళ్ళీ వారం అవ్వగానే ఆ విద్వారాలు మళ్ళీ తిరిగి వొచ్చి
అయ్యా సారు పోయిన వారం నేను నా రేషన్ కార్డ్ గురించి అప్లికేషన్ ఇచ్చి వెళ్ళాను కదా ఏమైందయ్య అంటూ అడిగింది
ఆఫీస్ బాయ్ అమ్మ నేను పోయిన వారమే చెప్పా కదా రేషన్ కార్డ్ ఎడిటింగ్ యాడింగ్ వొచ్చే సంవత్రం కానీ సైట్ రాదు అని వెళ్ళవమ్మ వొచ్చే సంవత్రం మళ్ళీ అర్జీ పెట్టుకో అన్నాడు
ఆమె అదేందయ్య నేను డబ్బులు కూడా ఇచి వెళ్ళాను కదా అంటూ అడుగగా ఆఫీస్ బాయ్
ఎమ్మమ్మో నువ్వు గాంగ్ ఇచ్చావ్ 1000 రూపాయలు అవి పోయిన సారి నీకు నేను సంధానం చెప్పినందుకు నీ అర్జీ తీసుకున్నందుకు అర్జిని చదివి ప్రాసెస్ లో పెట్టీ నందుకు సరి పోయింది కానీ ఇప్పుడు వెళ్ళు వెళ్ళి ఒక సంవత్రం తర్వాత రా పో అన్నాడు
ఆమె : మరెందుకు సారు 1000 తీసుకున్నారు నన్ను నడిపించారు ఈ ముక్క ముందే చెప్పి ఉంటే ఒచ్చి 1000 ఇచే దాన్నే కాదు కదా 1000 తో నేను నా బిడ్డ నెల మొత్తం తిన వొచ్చు మకుంజీవన ఆధారం లేకపోయిన మీరు చేస్తారనే నమ్మకం తో డబ్బులు ఇచ్చాను
ఆఫీస్ బాయ్ : వెళ్ళవమ్మ నువ్వు తింటే మాకెందుకు తినక పోతే మాకెందుకు ఆ డబ్బులు అప్లికేషన్ చార్జెస్ కి సరిపోయాయి లే వెళ్ళు
ఆమె పాపం ఇంకా చేసేది ఏమీ లేదు అన్నట్టు వేళ్ళ సాగింది కానీ వెళ్తూ వెళ్తూ మీరందరూ మట్టి కొట్టుకు పోతారు రా అందరూ పోతారు మీరంతా కలిసి కట్ట కట్టుకొని పోతారు నా బిడ్డ కి ఈ సంవత్రం చదువు లేకుండా చేశావ్ రా సచిన్నోడ
ఆ దేవుడు చూసుకుంటాడు రా మీ అందరిలెక్క పై వాడు తెలుసుతాడు అంటూ బాధ తో వెళ్ళి.పోయింది తన బిడ్డ నీ తీసుకొని 4 కిలోమీటర్ల నడక తో
ఆ తల్లి కన్నీళ్లతో వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కానీ ఆ ఆఫీస్ బాయ్‌కి, ఆ ఆఫీస్ లోని లంచగొండులకి తెలియదు... ఆమె అన్నట్టే 'ఆ పైవాడు' లెక్క తేల్చడానికి ఆల్రెడీ సిద్ధమయ్యాడని! ఆ వీధి లైట్ కింద కూర్చున్న రాజా రామ్ తన నోట్‌బుక్‌లో ఆఫీస్ బాయ్ అన్న చివరి మాటల కింద ఒక పెద్ద గీత గీశాడు. ఆ క్షణమే ఆ స్ట్రీట్ లైట్ ఒక్కసారిగా భయంకరంగా వెలిగి ఆరిపోయింది అనంత విశ్వంలో టెలిపతి సిగ్నల్స్ మారాయి. రాజా రామ్ నోట్‌బుక్‌లో రాస్తున్న ఈ పాపాల లెక్కల ముగింపు ఎలా ఉండబోతోంది? ఆఫీస్ బాయ్ కి ఎలాంటి శిక్ష పడబోతోంది?
(స్ట్రీట్ లైట్ తో జీవనం - పార్ట్ 4 త్వరలోనే... స్టే ట్యూన్డ్
Comments
Post a Comment