ది స్ట్రీట్ లైట్ పార్ట్ 2( THE STREET LIGHT ) part 2

 గమనిక: ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు పేర్లు ఊరి పేర్లు అన్ని కల్పితమైనవి నేను రాస్తున్న ఈ కథ కి నిజమైన వ్యక్తులతో కానీ పేర్లతో కానీ , ఏ వ్యవస్థతో ను ఎలాంటి సంబంధం లేదు ఇది కేవలం వినోదం కోసం మాత్రమే రాయబడినది


                     చెప్పుకో లేని గాయాలు

చెప్పుకో లేని గాయాలు

రాజా రామ్ అవి అన్ని చూసిన తర్వాత వల్ల నాన్న గారిని సమాధి చేసి కర్మ పిండ కార్యక్రమాలు అన్ని చూసుకొని ఇంట్లోనొక మూలన కూర్చొని ప్రతి నిత్యం నీళ్ళు నిప్పులు తిండి దాహం అన్ని మానేసి అదోలా బతక సాగాడు ఇది పక్కింటి రమ్య చూస్తూ ఏమి చెప్పలేక అతనిని ఎలా ఓదార్చాలో అర్ధం కాక చూస్తూనే ఉంది రమ్య కి తెలుసు రాజా రామ్ చాలా బాధలో ఉన్నాడు అతనిని కదిలించడానికి ఇది సరైన సమయం కాదు పైగా రమ్య కి పెళ్లి కుదిరింది అన్న విషయం చెప్పాలన్న రాజా రామ్  ఆ విషయానిని ఎలా తీసుకుంటాడో ఆమెకు అర్థం కావడం లేదు 

ఒక్క రోజు ధైర్యం చేసుకొని రమ్య రాజా రామ్ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది 

రమ్య: రాజా రామ్ ఇంకెన్నాళ్ళు ఇలాగే ఉంటావు సమయం తో పాటు మనం కూడా గాయాలను బాధలను  మర్చిపోయి సమయం తో పాటు ముందుకు సాగాలి ఇంకెన్నాళ్ళు నాన్న గారి జ్ఞాపకాలలో ఇలాగే ఉంటావ్ లేగూ లేసి అన్నం తిను

రాజా రామ్ : ఈ డొంక సాకులు చెప్పకు రమ్య నువ్వు నీ ఇంటెన్షన్ నాకు అర్థం అయ్యింది నువ్వు ఏం చెప్పాలను కుంటున్నావో రెండు మాటలో చెప్పేసేయి ఇన్ని బాధలకన్నా ఇంకో బాధ పెద్దదిగా అని పించదు లే డైరెక్ట్ గా పాయింట్ కి రా

రమ్య : రాజా రామ్ కోపపడకు నేను పెళ్లి గురించి అడిగిన ప్రతి సారి ఆర్మీ పేరు చెప్పి ఆపేశావు ఇప్పుడు మా నానా గారు నా పెళ్ళి ఫిక్స్ చేసేసాడు నేనేమి చేయలేను 

రాజా రామ్ : నేను ఉన్న ఈ పరిస్థితి లో నాకు తోడుగా ఉండాల్సిన నువ్వే ఇలా అంటావ్ అనుకోలేదు నీ ఇష్టం రమ్య నీకు నచ్చినది చేయి 

రమ్య : నన్ను ఎక్కడికైన తీసుకెళ్ళు రాజా రామ్ నేను నీతో.ఉండాలని కోరుకుంటున్నాను నువ్వు ఎక్కడ ఉంచిన నాకు సంతోషమే నేను నీతో మండపం నుండి కూడా పారిపోయి రా     గలను నువ్వు ఒక్క  మాట చెప్పు చాలు

రాజా రామ్ : లేదు రమ్య నీ తండ్రి మాటను గౌరవించడం నీ ధర్మం ఆయన చెప్పిన మాట విను చూడు ఇప్పుడు నేను ఉన్న నా ఈ పరిస్థితి నన్ను ఎక్కడికి తీసుకు వెళ్తుందో తెలియదు ఒక ఉద్యోగం లేదు బతికే హశ లేదు ఇకపై ఏమి చేయాలో తెలియదు నాకంటూ ఒక కుటుంబం లేదు ఏ తండ్రి అయినా తన బిడ్డ కి మంచి కుటుంబం ఇవ్వాలి అనుకుంటాడు నా దగ్గర ఏమి లేదు నువ్వు వెళ్ళి మీ నాన్నగారి మాట విని సంతోషంగా ఉండు

రమ్య వేరే మాట మాట్లాడకుండా తనకి కావలసిన మాట దొరికింది అన్నట్టు అక్కడ నుండి ఆ క్షణమే వెళ్ళిపోయింది

రాజా రామ్ ప్రేమలో కూడా విఫలమై బాధలో కుమిలింపోయి కూరుకు పోయాడు రాజా రామ్ జీవితం లో ఇది భరించలేని గాయం


         లంచాలు మరియు  లాన్నచ్నానాల  ప్రపంచం


లంచాలు మరియు  లాన్నచ్నానాల  ప్రపంచం


రమ్య అనుకున్న జీవితం రాజా రామ్ తనకి ఇచ్చేసాడు 30 రోజుల గడిచిపోయాయి ఇల్లంతా తేరి చూడగా రాజా రామ్ కి అతని నాన్నగారు రాసిన ఒక డైరీ కనిపించింది దాన్ని కన్నీలతో రాజా రామ్ తెరిచాడు అందులో వాళ్ల నానగారు రాజా రామ్ తో చిన్నప్పటి నుండి ఉన్న జ్ఞాపకాలను రాస్తూ చివర్లో నా కొడుకు ఆర్మీ కి వెళ్లకూడదు అనుకోడం నా స్వార్థమే కానీ రాజా రామ్ నిజంగా ఆర్మీ యూనిఫాం లో చాలా బాగుంటాడు వెళ్ళిన బాగానే ఉండు ఎలాగో నెలకొకసారి ఒచ్చి వెళ్తాడు గా అని రాసి ఉంది 

ఇక అంతే మా నానా గారు నన్ను వెళ్ళోద్దు అని నాతో అన్నా ఆయన కూడా అనుకున్నది ఇదే అని రాజా రామ్ గ్రామ్ పంచాయతీ లో ఉన్న స్ట్రీట్ లైట్ పక్కన ఉన్న యం ఆర్ ఓ 

  MRO ఆఫీస్ కి వెళ్ళాడు కాస్ట్ సర్టిఫికెట్ కోసం.అని

అక్కడికి వెళ్ళి ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ నీ సార్ నేను ఆర్మీ కి వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి నాకు కాస్ట్ ఇన్కమ్ నేటివిటీ సర్టిఫికెట్స్ కావాలి అని చెప్పాడు ఆఫీస్ బాయ్ తమ్ముడు కాస్ట్ సర్టిఫికెట్ కి 2000 రూపాయలు ఇన్కమ్ సర్టిఫికెట్ కి 5000 రూపాయలు నేటివిటీ సర్టిఫికెట్ కి 7000 మొత్తం 14000 రూపాయలు ఇస్తే నువ్వు చెప్పిన అన్ని తోరలోనే వస్తాయి 30 రోజులూ ఆగాలి MRO గారు చూడాలి వెరిఫై చేయాలి

రాజా రామ్ : అంత డబ్బులు ఎందుకు సార్ నేను ఏమన్నా కొత్త ఆస్తి పత్రాలు అక్రమంగా చేసి ఇవ్వమని అడిగానా ? లేక ఈ దేశం వాడిని కాక వేరే దేశం నుండి అక్రమంగా వచి దొంగ సర్టిఫికెట్. అడిగానా నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను నా ధృవీకరణ పాత్రలే కదా నేను అడిగాను నదైనది  నాకు ఇచ్చే దానికి మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి  సార్

ఆఫీస్ boy: యో రాజా రాము ఎక్కువ మాట్లాడకు ఇక్కడ ఇంతే అన్ని ఆఫ్లైన్ లో ఉంటాయి అయినా నీకేం తెలుసు MRO గారికి సంతకం పెట్టినందుకు ఇవ్వాలి vro గారికి సంతకం పెట్టినందుకు ఇవ్వాలి కార్యదర్శి కి ఇవ్వాలి ఇక్కడ కింద ఉడిచే వారి దగ్గర నుండి పై అధికారి వరకు అందరికీ ఇచ్చుకుంటూ రావాలి ఇక్కడ పైసలు లేకుండా ఏ పని జరగదు టేబుల్ కింద నుండి బబ్బు ఇవ్వు పని చేయించుకో   అందరికీ ఇచ్చుకుంటూ రావాలి అన్నాడు నీ పని అయిపోయాక ఆఫ్ లైన్ లో నీ సర్టిఫికెట్లు ఇంకో 30 రోజులలో వోచేస్తాయి అన్నాడు .

 జేబులో టీ తాగడానికి  2 రూపాయలు కూడా లేని రాజా రామ్ అక్కడే ఉన్న స్ట్రీట్ లైట్ దగ్గర ఉన్న బోరింగ్ నీళ్ళు తాగి కాసేపు ఆ స్ట్రీట్ లైట్ కింద కూర్చొని బాధ పడి తడబడుతూ   తిరిగి ఇంటికి వెళ్ళి పోయాడు .


 సొంతం అనుకున్న వారి మోసం మరియు వ్యవస్థ వైఫల్యత


          .సొంతం అనుకున్న వారి మోసం మరియు వ్యవస్థ వైఫల్యం




ఇంటికి వచ్చి చూస్తే రాజా రామ్ వాళ్ళ అత్త మామ ఇంట్లోకి  చొరబడి సామాన్లు అన్ని బయట పడేశారు రాజా రామ్ వెళ్ళి 

రాజా రామ్ : అత్త మామ ఏంటి ఇది నా సామాన్లు ఎందుకు బయట పడేస్తున్నారు నా సామానులు మొత్తం నేను ఇంట్లో లేని సమయంలో ఇలా సామాన్లు అన్ని బయట విసిరేయటం ఎందుకు  అని ప్రశ్నించగా 

అత్త: రాజా రామ్ ఇకపై ఈ ఇల్లు మాది ఇకపై మేము ఇక్కడే ఉంటాం

రాజా రామ్ : అదేంటి అత్త అలా అంటున్నారు నా ఇంట్లోకి చొరబడి ఇళ్ళు నాది అనడం ఇది తప్పు అత్త ఈ ఇల్లు మా అమ్మ నాన్న గారి గుర్తింపు అత్త నా నుండి లాక్కోవాలని చూడొద్దు అత్త నాకంటూ ఉన్నది కేవలం ఈ ఇళ్ళు మాత్రమే నా అనుకున్న మీరే ఇలా చేస్తే నేనెక్కడికి వెళ్ళాలి అత్త

అత్త: రే మర్యాదగా ఇక్కడ నుండి బయటకి వెళ్ళు  ఎక్కడికైనా వెళ్ళు ఏమైనా చేసుకో మాకు నీతో ఎటువంటి సంబంధం లేదు

రాజా రామ్ : అదేంటి అత్త మా అమ్మకి ఆడ బిడ్డగా నీకు ఈ ఇంట్లో అధికారం ఉంది అంటే అది బాగుంది కానీ ఇల్లు మొత్తం మీదే అంటే ఎలా మామ మీరన్న చెప్పండి అత్త కి మా అమ్మకి తొడ బుట్టిన వారు మీరు అందుకని ఇలా చేయడం తప్పు మీకు ఆస్తి ఏమన్నా వస్తోంది అని  ఉంటే మా అమ్మమ్మ దగ్గరే కానీ మాది ఎలా మీకు వర్తిస్తుంది మామయ్య మీకు రావాల్సింది ఎంత వరకో అమ్మమ్మ దగ్గర మీరు తీసుకున్నారు కదా ఇది మా నాన్న గారి ఙ్ఞాపకాలు ఉన్న ఇల్లు దిన్ని నా దగ్గర నుండి లాగొక్కోవద్దు మావయ్యా

మామ : రే రాజా రామ్ మీ ఇంటి దస్తావేజులు పొలం కాగితాలు అన్ని మా దగ్గరే ఉన్నాయి మీ నానగారు చనిపోక ముందు అన్ని   ఆస్తులు మాకు రాశి ఇచ్చారు నీకు ఇక ఈ ఊరిలో ఎక్కడ చోటు లేదు మీ సొంత ఊరికి వెళ్ళు ఇక్కడ నీకు ప్లేస్ లేదు వలస వొచ్చినోళ్ళు మీరు మీ ఊరికి వెళ్ళు మీ నాన్న తో అన్ని ఇక్కడ నీకు అంతం అయ్యాయి

ఇదంతా జరిగాక రాజా రామ్ మళ్ళీ MRO ఆఫీస్ వెళ్లి అదే ఆఫీస్ బాయ్ కి విషయం చెప్పాడు అతను ఇలా అన్నాడు.    

ఆఫీస్ బాయ్: రాజా రామ్ నీతో అన్ని సమస్యలే నయ్యా చూడు వాళ్ళు ఆ పేపర్స్ అన్ని వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసినందుకు 3 లక్షలు ఇచ్చారు నువ్వు 5 లక్షలు ఇవ్వు అన్ని నీకు ఇచ్చేలా నేను చేస్తాను

రాజా రామ్  :అంటే నా ఇంట్లో నేను ఉండడానికి కూడా నేను డబ్బు కట్టాలా అని కోపం తో బయటకి వెళ్ళి పోయి బయట ఉన్న స్ట్రీట్ లైట్ కింద తనలో.తనే బాధ పడుతూ తనలో తానే sanuguthu ఈ ప్రపంచం తనకి ఇచిన గాయాలు బాధలు అన్నిటి గురించి ఆలోచిస్తూ . 



ఈ ప్రపంచంతో మరియు ఈ లోకపు ఆలోచనలకు దూరంగా అనంత విశ్వం లో లీనం 

అనంత విశ్వం లో లీనం


పగలు రాత్రి తెలియకుండా నే అక్కడే కూర్చొని చేతిలో ఒక నోట్ బుక్ ఒక పెన్ను పట్టుకొని అక్కడే కూర్చొని నిద్ర పోయాడు అతను నిదురలో కూరుకు పోయిన తరువాత ఆ పగలు గడిచి పోయింది అయిన లేవలేదు ఆ రాత్రి అతని మెదడు నుండి ప్రతిజవలించిన మేధస్సు  అతను అక్కడ ఉన్న ఆ స్ట్రీట్ లైట్ కూర్చొని నిద్ర పోతూ విశ్వం లో లీనమై లైట్ కింద నిద్రిస్తున్న ఉన్న రాజా రామ్ ఇప్పుడు మన ప్రేపంచంలో లేడు ఆది అతని మేధా శక్తి ఇప్పుడు అనంత విశ్వం లో సంచరిస్తూ ఉంది కొన్ని టెలీపతి సిగ్నల్స్ ద్వారా అతను ఇప్పుడు ఒక కొత్త ప్రపంచం లో ఉన్నాడు అతని అంతరంగం అతని ఆత్మ ఇప్పుడు ఆ అన్నంత విశ్వాన్ని చూస్తూనే ఉంది ఆది ఒక multi universe అక్కడ మాయం అయిన వాళ్ళు ఇంతవరకు ఎవ్వరు తిరిగి రాలేదు కానీ అక్కడికి రాజా రామ్ తనకై తనే వెళ్లలేదు కానీ అతని బాధ , అతని గాయాలు , అతని కి జరిగిన అన్యాలను అన్నిటిని ఎవరూ చూస్తారు ఎవరు గమనిస్తారు అనుకున్నారు అందరు వారి వారి పన్నాగాల మీద ఉన్నారు వాళ్ళంతా ఒక్కటై.ఉన్నారు ఎవరికి కూడా గోరంత కీడు కోరని రాజా రామ్ నీ టెలీపతి సిగ్నల్స్ ద్వారా ఆ మల్టీ యూనివర్స్ తన కి తనే రాజా రామ్ నీ ఆ స్ట్రీట్ లైట్ మూలంగా తన మేధస్సు నీ తీసుకెళ్ళింది పోయింది రాజా రామ్ కి ఈ లంచాల లోకం నచ్చలేదు 
అతని విసిగి పోయి విరిగిపోయిన తన మనసు తెలిసి తెలియకనో తెలిపతి సిగ్నల్స్ ద్వారా ఇప్పుడు అతను.
( Multi universe ) మాయమై పోయాడు అతని.శరీరం ఒక పెన్ను నోట్ బుక్ పట్టుకొని ఆ స్ట్రీట్ లైట్ కింద కూర్చొని నిద్ర పోతూ ఉన్నాడు

ఇకపై ఈ స్ట్రీట్ లైట్ ద్వారా ఏం జరిగిందో మనం 3 వ భాగం లో చదువు కొందాం అప్పటి దాకా వేచి ఉండండి 3వ భాగం త్వరలోనే

© Copyright yesudas all rights reserved 




Comments

Popular posts from this blog

పాత టంకు పెట్టె (Part 1)

LAST CIGARETTE (లాస్ట్ సిగరెట్) - భాగం 1

​విరిగిన గడియారం (Tuti Hui Ghadi)