పాత టంకు పెట్టె (Part 1)


(డిస్క్లైమర్):

ఈ కథ పూర్తిగా కల్పితం మరియు కేవలం వినోదం కోసం మాత్రమే రాయబడింది. ఇందులో ఉన్న పాత్రలు, స్థలాలు మరియు సంఘటనలు అన్నీ కేవలం రచయిత ఊహ మాత్రమే. ఈ కథలోని పాత్రల యొక్క బిందాస్ జీవనశైలిని మరియు వినోదాన్ని చూపించడానికి మాత్రమే మద్యం ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మేము ఎలాంటి మాదకద్రవ్యాల లేదా మద్యపాన సేవనాన్ని సమర్థించము మరియు ప్రోత్సహించము. దయచేసి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి.


 1. మఖన్‌పూర్ లో ఇద్దరు మస్త్ మిజాజ్ దోస్తులు

మఖన్‌పూర్ లో ఇద్దరు మస్త్ మిజాజ్ దోస్తులు


 ఇద్దరు స్నేహితులు మాఖనంపూర్ లో ఉన్నారు. ఆ ఊరిలో ఈ ఇద్దరు దోస్తులు ఎంత మస్త్ మస్తు గజిబిజి  గా ఉంటారంటే, అసలు ఊరంతటిలో వీళ్లలాంటి వాళ్లు ఇంకొకరు ఉండరు. వీళ్ల జీవితానికి ఒకటే ముచ్చట—ఎవరితో సంబంధం లేకుండా తమ లోకంలో తాముండటం, ఎప్పుడూ ఖుషీగా తిరగడం. నా ఇంకోటి ఏంటంటే... వీళ్లకు సంపాదించాలనే చింత లేదు, తినాలనే గోల లేదు, తాగాలనే చింత తప్ప మరే గోల లేదు. ఈ లోకం ఏమైపోతే మాకేంటి అనుకునే రకం వీళ్లు. వీళ్ల స్నేహం ఎలాంటిదంటే, వీడు వాడిని jhinga అని పిలిస్తే, వాడు వీడిని bhinga అని పిలుస్తాడు. ఇక అంతే, ఇవే వాళ్ల పేర్లు, ఇదే వాళ్ల ప్రపంచం.

మత్తు మాయ తప్ప మరే మాయ లేదు తాగి మనలోకలోనే ఉందామన్నే తప్పన తప్ప మరో యవ్వరమే ఒద్దన్నట్టు

ఉంటారు

వీళ్ల రోజువారీ రొటీన్ ఒకటే లాగా సాగుతుంది. పొద్దంతా అడవుల్లో తిరగడం, ప్రకృతిని ఎంజాయ్ చేయడం, మూడ్ వస్తే సారా దుకాణం (మందు షాప్) లో కూర్చుని ప్రశాంతంగా సారాయి తాగడం. ఈ లోకంలో ఏం జరుగుతుంది, ఎవడి ఇల్లు కూలిపోతుంది,ఎవర్ధింకాలిపోయింది , ఎవరి సంసారం బాగుపడుతుంది అనే విషయాలతో వీళ్లకు బొంగు  కూడా అవసరం  లేదు.

అసలైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే రాత్రి పూట. కరెక్ట్ గా రాత్రి 9 గంటలు కాగానే వీళ్లిద్దరు ఆ మందు షాప్ లోంచి బయటకు వస్తారు. దారిలో నడుస్తూ ఇద్దరూ చేతుల్లో చేతులు వేసుకుంటారు, కాళ్లు ఇటు అటు పడుతుంటే ఊగుతూ ఒక వింతైన, మస్త్ సాంగ్ పాడుకుంటూ వెళ్తారు. ఆ పాట ఎలా ఉంటుందంటే:

"రింగా రింగా రింగా రింగా... ఉస్కో భీ మై చాహూ రింగా రింగా... దారు బింగా పీఠా జింగా... జింగారే హూ హా మంగా మంగా..."

ఈ ఇద్దరు ఈ పాట పాడుతున్నప్పుడు వీళ్లకు తాము ఏం పాడుతున్నామో, ఏం చేస్తున్నామో అస్సలు సోయా (స్పృహ) ఉండదు. అంతే... తమ శృతిలో లో తాము మస్త్ గా ఉంటారు, అసలు లైఫ్ లో ఎలాంటి టెన్షన్ లేనట్టు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్లది 'జింగా జింగా' లైఫ్. పొద్దంతా తాగడం, రాత్రి ఇదే జింగా జింగా పాట పాడుకుంటూ నవ్వుకుంటూ ఇంటికి రావడం. దారిలో ఎవడు ఎదురైనా వీళ్లు ఎవరికీ ఏమీ అనరు, ఎవడైనా పిచ్చి ప్రేలాపనలు పేలితే అస్సలు వినరు. గప్‌చుప్‌గా ఇంటికి వస్తారు, దొరికింది తింటారు, రాత్రికి పడుకుంటారు. పొద్దున్నే లేవగానే మళ్లీ తమ పాత ప్రపంచంలోకి వెళ్ళిపోతారు.


2. మందు దుకాణంలో కసరత్తు... వింతైన యాక్షన్ సీన్

కసరత్తు... వింతైన యాక్షన్ సీన్


ఒకరోజు ముచ్చట ఇది. జింగా మరియు బింగా ఎప్పటిలా మఖన్‌పూర్ లోని ఆ పాత మందు షాప్ లో కూర్చుని ఉన్నారు. టేబుల్ మీద విస్కీ బాటిల్ ఓపెన్ చేసి ఉంది, ఇద్దరూ తమ ముచ్చట్లలో మునిగిపోయారు. సరిగ్గా అదే టైమ్‌కి ఊళ్లో ఉండే ఇద్దరు రౌడీ కుర్రాళ్లు అక్కడికి వచ్చారు. వాళ్లు తామేదో పెద్ద గుండాలం అనుకుంటూ ఆ మైఖానాలో అందరినీ భయపెట్టాలని చూస్తున్నారు.

ఆ ఇద్దరు వచ్చి మన జింగా, బింగా కూర్చున్న టేబుల్ దగ్గర ఆగారు. రొమ్ము విరుస్తూ, గంభీరమైన గొంతుతో అరిచారు, "యే జింగా బింగా... మీరు ఇక్కడ క్ర్చోగూడదు బే. చల్, దొబ్బెయండి ఇక్కడ నుండి బయకెల్లి తాగండి రా , యే మేము రోజు ఇక్కడే రా తాగేది నువ్వు ఎవడివి రా మమ్మల్ని పొమ్మనడానికి

జింగా మరియు బింగా తమ చేతిలో ఉన్న గ్లాసుల వైపు చూశారు, ఆ తర్వాత ఆ కుర్రాళ్ల వైపు చూశారు. వీళ్ల ముఖాల్లో భయం అనే మాటే లేదు. తిరిగి, బింగా చాలా కూల్‌గా నవ్వుతూ అన్నాడు, "ఎందుకు రా? ఇక్కడ కూర్చుంటే  ఏంటి? ఇదేమన్నా మీ ముత్తాతల అష్టా  నీకేమనా రాశి  ఇచ్చారా ఏంటి ?" (ఎందుకు అన్న, ఇక్కడ కూర్చుంటే తప్పేంటి? మీ ముత్తాత ఏమైనా ఈ టేబుల్ ని నీ పేరున రాసిచ్చాడా ఏంటి?)

ఈ మాట వినడమే ఆలస్యం, ఆ రౌడీల కోపం ఏడో ఆకాశానికి చేరింది. "మీకు ఎంత ధైర్యం!" అంటూ ఆ ఇద్దరూ జింగాను కొట్టడానికి ముందుకు వచ్చారు.

ఇక్కడ ఎవరైనా మామూలు మనుషులు ఉంటే భయపడేవాళ్లు లేదా కర్రలు, రాళ్లు తీసేవాళ్లు. కానీ మన జింగా, బింగా వేరే మట్టితో తయారయ్యారు కదా! వాళ్లు ఆ గుండాల మీద చెయ్యి కూడా ఎత్తలేదు. తాము కూర్చున్న కుర్చీల్లో అలాగే కూర్చుని, దారు తాగుతూ, చఖనా తింటూనే వాళ్ల దెబ్బల నుంచి తప్పించుకోవడం స్టార్ట్ చేశారు. మొదటి రౌడీ గుద్ది పడేద్దామని ముష్టి ఎత్తితే, జింగా విస్కీ సిప్ చేస్తూ జస్ట్ కొంచెం వెనక్కి వంగుతాడు, ఆ దెబ్బ గాల్లోకి వెళ్తుంది. రెండో వాడు చెంప పగలగొడదామని వస్తే, బింగా నోట్లో నంజుడు ముక్క వేసుకుంటూ తల పక్కకి తిప్పుతాడు. కాలి కేసి కొట్టాలంటే వాళ్ళు గాల్లో ఉంటారు నడుం కేసి కొడతాం అంటే రింగ్ రింగ్ పాట పాడుతూ రింగో అని ఇద్దరు గిర గిర తిరుగుతారు

ఆ వైన్స్ షాప్ లో ఉన్న వాళ్లంతా నోరెళ్లబెట్టి చూస్తున్నారు. మన జింగా, బింగా వాళ్లపై కనీసం చేయి కూడా ఎత్తకుండా, విస్కీ తాగుతూ చికెన్ మొత్తం ముక్కలు అలా నములుతూ , వాళ్ళను వాళువల్లు తప్పించు కుంటుం ప్రశాంతంగా మందు నీ మాత్రం ఓడలకుండా హ్యాపీ గా రాసుకోకుంటూ తీసుకుని రిస్కు లా కాకుండా రాసులుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు . కొట్టడానికి వచ్చిన వాళ్లే గాల్లో చేతులు, కాళ్లు ఊపి ఊపి బాగా అలిసిపోతున్నారు.


3. గుండాల సరెండర్... జింగా-బింగా స్వాగ్

స్వాగ్


కొంతసేపు ఈ తమాషా అలాగే నడిచింది. జింగా మరియు బింగా విస్కీ బాటిల్ మెల్లమెల్లగా ఖాళీ అవుతోంది, అక్కడ ఆ రౌడీల ఊపిరి ఆగిపోతోంది. వాళ్లు కొట్టే కొట్టి కండ్లు తిరుగుతూ  వాళ్ళే అంత విపరీతంగా  అలిసిపోయారంటే వాళ్ల మోకాళ్లు వణకడం మొదలయ్యాయి. ఇక తమవల్ల కాదని డిసైడ్ అయ్యాక, ఆ ఇద్దరు రౌడీలు వెనక్కి తగ్గారు.

వాళ్లలో ఒకడు నడుము మీద చెయ్యి వేసుకుని, రొప్పుతూ సొప్పుతూ ఇలా  అన్నాడు, "అన్నా గారు దొరగారు... మీరే కూర్చోండి అబ్బా  ఇక మా వాళ్ళ కాదు అయ్యా సామి మీరే నయ్యా గొప్పా. మేమే అటు వెళ్ళిపోయి కూర్చుంటాం అయ్యో, అబ్బా మీరేం మనుషులు రా స్వామయ్యా మా వాళ్ళ కాదులే మీరు అస్సలు ఏ మట్టితో తయ్యారునయ్యారో అస్సలుబర్ధాంకట్లేదు,మీరు అలిసి పోరు ఓడి పోరు! అయ్యారే , దండం రా బాబు మీకు !"

అలా అని చెప్పి వాళ్లు తమ పరువు కాపాడుకోవడానికి గమ్ముగా పక్క టేబుల్ కి వెళ్లి పడిపోయారు, ఒంట్లో అస్సలు ప్రాణం లేనట్టు. వైన్స్ షాపులో ఉన్న మిగతా వాళ్లంతా చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేశారు, కానీ మన జింగా, బింగాకు ఈ చప్పట్లతో, ఈ లోకంతో ఏం పని? వాళ్లు బాటిల్ ఫినిష్ చేశారు, టేబుల్ మీద పైసలు పెట్టారు, ఎప్పటిలాగే మళ్లీ చేతుల్లో చేతులు వేసుకుని "రింగా రింగా" పాడుకుంటూ తమ ఇంటి దారి పట్టారు. ఇక ఈ వీళ్ళకి ఇదే పిచి మా లోకం లో తనదైన విధానం లో Routine  అలా వాళ్ళకి సాగిపోతుందబ్బ .


4. రాజ్ ఘరానా... ఆ పాత టంకు పెట్టె మరియు రాణుల ప్లాన్

టంకు పెట్టె


ఇక్కడే మన కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఇదే మఖన్‌పూర్ ఊరి ఒక కోనలో చాలా పెద్ద, పాత రాజ్ ఘరానా (రాజభవనం) ఉండేది. ఆ రాజభవనంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండేవారు, వాళ్ల పేర్లు రాణి మరియు తాని. వాళ్లే ఆ భవనానికి యజమానులు. వాళ్ల ఇంట్లో, అంటే ఆ మహల్ లోని ఒక సీక్రెట్ రూమ్ లో చాలా కాలం నాటి ఒక పెట్టె ఉండేది, అది వాళ్ల ముత్తాతల కాలం నాటి పాత

( టంకు పెట్టె.)

అది లాంటిలాంటి పెట్టె కాదు, ఇనుముతో చేసిన చాలా బరువైన పెద్ద ట్రంక్ బాక్స్ (టంకు పెట్టె). ఆ పెట్టెకు ఒక వింతైన, గట్టి తాళం వేసి ఉంది. ఆ టంకు పెట్టె తాళం వేసి వుంది కాబట్టే... దాన్ని తెరవడానికి ఆ రాజవంశం వాళ్లు ఎన్నో ఏళ్లుగా ట్రై చేస్తున్నారు. అరే, చాలా మందితో ప్రయత్నించారు, పెద్ద పెద్ద తాళాలు పగలగొట్టే ఎక్స్‌పర్ట్స్‌ని, తెలివైన వాళ్లని పిలిపించారు, కానీ ఆ పెట్టె ఎవరికీ లొంగలేదు. ఎంతమంది తమ శక్తినంతా ఉపయోగించినా ఆ పాత టంకు పెట్టె అస్సలు కదల్లేదు.

భవనం కి ఉన్న ఎత్తైన కిటికీలోంచి రాణి, తాని తరచూ ఊరి వైపు చూస్తూ ఉండేవాళ్లు. వాళ్లిద్దరూ రోజు ఈ జింగా, బింగా ల మస్త్ మిజాజ్, వాళ్ల సారా దుకాణం ఫైట్ ముచ్చట, రాత్రి పూట చేతులు పట్టుకుని పాట పాడుకుంటూ వెళ్లడం అంతా గమనిస్తూనే ఉన్నారు. ఈ ఇద్దరు దోస్తుల బిందాస్ లైఫ్ స్టైల్ ఆ రాజకుమార్తెలకు బాగా నచ్చేసింది.

ఒకరోజు కిటికీ దగ్గర నిలబడినప్పుడు, జింగా-బింగా కింద నుంచి పాట పాడుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు రాణి, తాని వైపు చూసి అంది, "యే చెల్లి, ఈ పాత టంకు పెట్టె కో తెరచా గలిగితే విల్లా వల్ల అయితది ఒక సారి ప్రయత్నించి చూస్తే, ఎలా ఉంటది? ఇలా చేసి చూద్దాం బాగుంటది ఉంటుంది."

తాని కొంచెం ఆలోచిస్తూ సమాధానం ఇచ్చింది, "నీ ఆలోచన కూడా సబబే... ఈ తగోబోతోలా వాళ్ళా వల్ల అయితది అంటావా? మనం రోజు చూస్తున్నాం కదా, వీళ్లు ఇరవై నాలుగు గంటలు తమ మధురం లోనే ఉంటారు."

రాణి నవ్వుతూ అంది, "అరే బాగుంది చెల్లి నువ్వుకూడా చెప్పేది! ఎవరితోనూ వీళ్లకు సంబంధం లేదు. ఈ లోకపు గొడవలకు వీళ్లు చాలా దూరం, నిజం చెప్పాలంటే వీడంటే నాకు చాలా ఇష్టం."

తాని కూడా కొంచెం సిగ్గుపడుతూ అంది, "నువ్వు చెప్పింది నిజమే, నాకూ ఇష్టమే. సరే అయితే, అస్సలు ఆ పెట్టెలో ఏముందో మనకైనా తెలుస్తుంది కదా, మన ముత్తాత మనకోసం అందులో ఏం దాచిపెట్టాడో చూద్దాం."

అప్పుడే రాణి బుర్రలో ఒక క్రేజీ అండ్ పెద్ద ఐడియా వచ్చింది. ఆమె తన చెల్లెలి చెయ్యి పట్టుకుని ఒక పెద్ద కండీషన్ పెడుతూ అంది, "ఒక పని చేద్దాం. ఒకవేళ వీళ్లిద్దరి వల్ల గనుక ఈ పాత టంకు పెట్టె తెరుచుకుంటే... మనం వీళ్లిద్దరినే పెళ్లి చేసుకుందాం, వీళ్లనే మన జీవిత భాగస్వాములుగా చేసుకుందాం!"

తాని కూడా నవ్వుతూ ఈ ముచ్చటకు ఓకే చెప్పేసింది. ఆ రాజభవనంలోని ఇద్దరు రాణులు ఇక డిసైడ్ అయిపోయారు, ఎలాగైనా ఈ మస్త్ బిందాస్ దోస్తులను మహల్ కి పిలిపించాలని.

ముందు ఏం జరుగుతుంది?

మఖన్‌పూర్ లో కేవలం సారా తాగుతూ, తమ లోకంలో తాముండే ఈ ఇద్దరు తాగుబోతు దోస్తులు, ఆ రాజవంశపు ఎన్నో ఏళ్ల నాటి బరువైన పాత టంకు పెట్టె తాళాన్ని తెరవగలరా? అసలు జింగా మరియు బింగా ల అదృష్టం మారబోతుందా, వాళ్లకు ఆ ఇద్దరు అందమైన రాణులతో పెళ్లి జరుగుతుందా? లేదా ఆ పాత టంకు పెట్టె లోపల ఏదైనా ప్రమాదకరమైన సీక్రెట్ దాగి ఉందా, అది వీళ్ల 'జింగా జింగా' లైఫ్ ని ఎప్పటికీ మార్చేస్తుందా?

ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా సస్పెన్స్ మరియు మజాతో చదవడానికి వెయిట్ చేయండి part 2 కోసం


© Copyright yesudas all rights reserved 

Comments

  1. థ్యాంక్ యూ tanku pette పార్ట్ 2 2డేస్ తరవాత పబ్లిష్ చేస్తాను

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

LAST CIGARETTE (లాస్ట్ సిగరెట్) - భాగం 1

​విరిగిన గడియారం (Tuti Hui Ghadi)