12 ఏళ్ల అనుబంధం: నా కన్నబిడ్డ లాంటి బాదం చెట్టు! 🌳💔
ఈ ప్రపంచంలో మూఢనమ్మకాలకు ఉన్న బలం, ప్రాణం ఉన్న ఒక జీవి విలువను కూడా గుర్తించనివ్వదు. కన్నబిడ్డలా పెంచిన ఒక చెట్టుకు, ఒక మనిషి జీవితానికి మధ్య ఉన్న చల్లటి బంధాన్ని.. ఎవడో ఒక సిద్ధాంతి మాటలు ఎలా ముక్కలు చేశాయో చెప్పే కన్నీటి కథ ఇది.
1. ప్రాణం పోసిన మొక్క.. ఐదేళ్ల నిరీక్షణ!
ఈ నేల మీద అసలు బాదం చెట్టు బతకదు అని అందరూ అన్నారు. కానీ ఎలాగైనా సరే దాన్ని బతికించాలి, రేపు ఎండకాలంలో ఆ చెట్టు ఇచ్చే చల్లటి నీడలో ప్రశాంతంగా పడుకోవాలి అనే పెద్ద ఆశతో ఒక చిన్న మొక్కను తెచ్చి నాటాను. అది కేవలం మొక్క కాదు, నా నమ్మకం.
- ఊరి జనాలు: "రేయ్, ఈ నేలలో బాదం చెట్లు బతకవురా, ఎందుకు అంత ఆశ?"
- నేను (నా మనసులో): "నమ్మకం ఉంటే బతుకుతుంది. దీని నీడ నాకు కావాలి. దీని కోసం ఎన్ని ఏళ్లయినా ఎదురుచూస్తా."
ఆ ఆశతోనే ఐదేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎదురుచూశాను. ఐదేళ్ల తర్వాత అది కాస్తా పచ్చటి పెద్ద చెట్టుగా మారి నా ఇంటిని కప్పేసింది.
2. నా బిడ్డ.. నా సంసారం.. ఆ చల్లటి పందిరి!
ఉద్యోగం రీత్యా నేను ఇంటికి దూరంగా పని చేస్తూ ఉండేవాడిని. కానీ మనసంతా ఆ చెట్టు పైనే ఉండేది. ఎప్పటికైనా ఆ చెట్టు నీడ నాకే సొంతం అనుకుంటూ నా బిడ్డలా ప్రేమగా చూసుకున్నాను. అలా ఎనిమిదేళ్లు గడిచాయి. నా పెళ్లయింది, నాదంటూ ఒక కుటుంబం ఏర్పడింది.
ఆ బాదం చెట్టు కింద ఈత ఆకులతో చిన్నగా పిల్లల పందిరి వేసుకున్నాను. నేను, నా పిల్లలు ఆ చెట్టు కింద ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా పడుకునేవాళ్లం, ఆడుకునేవాళ్లం. మా అమ్మకు, నా భార్యకు కూడా ఆ చెట్టు నీడంటే ఎంతో ప్రాణం. ఇంట్లో వంట చేయాలన్నా అక్కడే చేసేవాళ్లు. ఆ చెట్టు ఉన్నంత కాలం మా ఇల్లు చూడటానికి ఎంతో అందంగా, పచ్చగా కళకళలాడుతూ ఉండేది.
3. సిద్ధాంతి ఎంట్రీ.. వింత లాజిక్కులు!
చెట్టుకు 12 ఏళ్లు నిండాయి. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో, ఎవడో ఒక సిద్ధాంతి మా నాన్నగారి దగ్గరకు వచ్చాడు. బహుశా వాడికి పిల్లలు లేని గొడ్రాలి తనం ఏమన్నా ఉందో ఏమో.. మా ఇంట్లో వచ్చే చిన్న చిన్న కష్టాలన్నింటికీ ఆ బాదం చెట్టే కారణం అని మా నాన్న తలకెక్కించాడు.
- సిద్ధాంతి: "కుమార్ గారూ! మీ ఇంట్లో తట్టుకోలేని కష్టాలు రావడానికి కారణం మీ ఇంటి ముందున్న ఆ బాదం చెట్టే. దాన్ని ఉంచితే కష్టాలు ఇంకా పెరుగుతాయి, వెంటనే నరికేయండి!"
- నాన్న కుమార్: "అవునా స్వామి? చెట్టు వల్లే ఇవన్నీ వస్తున్నాయా? అయితే తీసేయాల్సిందే."
- నేను (ఆగ్రహంతో): "నాన్న! బాదం చెట్టు ఇంట్లో ఉంటే బాధలు వస్తాయా? మరి బాధలు వచ్చే చెట్లను దేవుడు ఎందుకు సృష్టించాడు? మనం గొర్రెను కోసుకుని తినేటప్పుడు, కోడిని నరికి తినేటప్పుడు వాటికి బాధ ఉండదా? బాధలు ఒక్క మనుషులకేనా.. చెట్టుకు బాధ ఉండదా? మనం చేసే తప్పుల వల్ల ఇంట్లో పరిస్థితులు చెడిపోతే, దానికి చెట్టు ఎలా కారణం అవుతుంది? పొలాల్లో కూడా బాదం చెట్లు ఉంటాయి కదా, మరి పొలానికి బాధ వచ్చి పంట ఇవ్వడం ఆపేసిందా? పెంచిన నేలకు లేని బాధ.. ఈ మనిషికి ఎందుకు వస్తోంది? వాడు ఎవడో పిల్లలు లేని గొడ్డు నా కొడుకు కాబట్టే.. నా బిడ్డలాంటి చెట్టును కొట్టమంటున్నాడు!"
4. ప్రతిరోజూ నరకమనే బాధ.. ఒక నల్లని ఉదయం!
కానీ నా మాటలు ఎవరూ వినలేదు. ఆ సిద్ధాంతి చెప్పినప్పటి నుండి ఇంట్లో ప్రతిరోజూ "ఆ చెట్టును కొట్టించేయ్.. కుటుంబంలో బాధలు పోతాయి.. దాన్ని తీసేయ్" అనే గొడవలే. ఊరి వాళ్లను, తెలిసిన వాళ్లను పిలిచి "ఈ చెట్టును తీసేస్తే మంచిదేనా?" అని అడగడం మొదలుపెట్టారు.
| Penchina chethithone goddali vetu |
చివరకు ఒకరోజు ఉదయం.. చేతిలో గొడ్డళ్లతో ఇద్దరు కూలీలు ఆ చెట్టును నరకడానికి వచ్చారు. వాళ్లు చెట్టు దగ్గరకు వెళ్లగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నన్ను చూసి వాళ్లు కూడా భయంతో ఆగిపోయారు.
- కూలీలు: "ఏంటయ్యా.. బాబు అంత బాధపడుతున్నాడు? మేము నరకలేం."
- నేను (కన్నీళ్లతో గొడ్డలి అందుకుంటూ): "ఆగండి.. ఈ చెట్టును నరికే పాపం మీకు ఎందుకు చుట్టుకోవాలి? ఇటు ఇవ్వండి ఆ గొడ్డలి."
నా కన్నబిడ్డను నేనే చంపుకుంటున్నాననే బాధతో, ఆ పాపం వేరే ఎవరికీ తగలకూడదని, నేనే స్వయంగా గొడ్డలి తీసుకుని ఆ చెట్టు మీద మూడు సార్లు చిన్నగా దెబ్బలు వేశాను. ఆ తర్వాత వాళ్లు ఆ చెట్టును పూర్తిగా నరికేసి పడేశారు. నా 12 ఏళ్ల ప్రేమ నేలకూలిపోయింది.
5. కర్మ ఫలం.. ఎండిపోయిన నేల!
ఇప్పుడు ఆ చెట్టు లేదు. మా ఇల్లు చూడటానికి తల మీద గుడ్డ లేని ఒక అభాగ్యురాలిలా, ఒంటరిదానిలా కనిపిస్తోంది. ఒకప్పుడు చల్లగా ఉన్న ఆ నేల.. ఇప్పుడు ఎండకు మాడిపోతూ కాలుతోంది.
- ఊరి జనాలు: "పోన్లే బాబు, కష్టాలు పోతాయన్నారుగా, ఆ చెట్టుపై మమకారం వదిలేసుకో."
- నేను (ఆవేదనతో): "కష్టాలు ఎక్కడికి పోతాయండి? మనుషులకు వచ్చే కష్టాలు వాళ్లు చేసుకునే 'కర్మ ఫలం' వల్ల వస్తాయి కానీ.. ఇలాంటి నోరులేని చెట్ల వల్లో, ప్రాణం లేని గోడల వల్లో వస్తాయా? సైన్స్ ఇంత పెరిగినా ఈ మూఢనమ్మకాలు మారవా?"
చెట్టు పోయింది.. కానీ నా గుండెల్లో అది మిగిల్చిన చల్లటి జ్ఞాపకాలు, అది నరికినప్పుడు కలిగిన గాయం ఎప్పటికీ మానవు.
Comments
Post a Comment