​చల్ల నీళ్లు మరియు సైకో కాత్రే: ఒక వింత ప్రతికార కథ | telugu kathalu

​Disclaimer : ఈ కథ లోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఎవరి జీవితంతో ఈ కథకి ఎటువంటి సంబంధం.లేదు 


1. నీమకఠారి గ్రామం మరియు ఆ వింత జననం

Kaatre-prathikaaram-manchi nillu badha |telugu painfull story



నీమకఠారి గ్రామం చరిత్రలో ఎన్నో వింతలు, విచిత్రాలు జరిగాయి. ఆ ఊరి మట్టిలోనే ఏదో మాయ ఉందంటుంటారు పెద్దలు. కానీ, ఆ ఊరిలో నివసించే పపితా రాణి మరియు పక్కా పాపడ్ దంపతుల ఇంట్లో ఒక బాబు పుట్టాడు అప్పుడు జరిగిన వింతను మాత్రం చరిత్రలో ఎవ్వరూ ఊహించలేదు, కనీసం వినలేదు కూడా. 

నవ మాసాలు మోసి పపితా రాణి ఒక ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం ముగిసిన తర్వాత, హాస్పిటల్ నర్స్ ఆ పసిపాపకు మొదటి స్నానం చేయించడానికి ఒంటిపై చల్లటి నీళ్లు పోసింది. అంతే! ఆశ్చర్యకరంగా ఆ పసిపాప ఒక్కసారిగా పెద్ద కళ్లు తెరిచి, చుట్టూ ఉన్నవారి వైపు చూసి ఎంతో స్పష్టంగా, గంభీరంగా మాట్లాడింది చల్ల నీళ్లు!" (నాకు చల్ల నీళ్లు).

Challa nillu puttadu


ఆ మాట వినగానే ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న నర్సులు, డాక్టర్లు భయంతో వణికిపోయారు. ఒక నిమిషం పాటు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. కానీ, ఆ మాట అన్న మరుక్షణమే ఆ బాబు మళ్లీ ఎప్పుడూ అలా మాట్లాడలేదు, మామూలు పసిపిల్లల్లాగే ఏడవడం మొదలుపెట్టాడు. కాలం గడిచినా ఆ వింత సంఘటనను తల్లిదండ్రులు మర్చిపోలేదు నిజం చెప్పాలంటే ఆ రోజు తిక మక యవ్వారమే అనుకోవచ్చు.


 ఆ చల్లటి నీళ్ల జ్ఞాపకం వల్లే, తమ బిడ్డకు విచిత్రంగా 'చల్ల నీళ్లు' అని పేరు పెట్టారు. ఆ పేరు వినడానికి వింతగా ఉన్నా, ఊరి జనాలు కాలక్రమేణా దానికి అలవాటు పడిపోయారు.

2. అమాయకత్వానికి నిలువుటద్దం – చల్ల నీళ్లు వ్యక్తిత్వం



​'చల్ల నీళ్లు' పెద్దయ్యాక కూడా సరిగ్గా తన పేరు లాగే ఉన్నాడు. అతని మనసు కూడా  చల్లటి నీళ్లలాగే ఎంతో ప్రశాంతంగా, అమాయకంగా, ఎవరికీ కీడు చేయని దయా హృదయంతో ఉండేది. లోకంలో ఎంత స్వార్థం ఉన్నా, 


చల్ల నీళ్లు ప్రపంచం మాత్రం చాలా ప్రత్యేకం. ఊళ్లో మిగతా యువకులు అమ్మాయిల గోల, ప్రేమ వ్యవహారాలు, బైకులపై తిరుగుళ్లు, చెడు అలవాట్లలో మునిగి తేలుతుంటే, ఇతను మాత్రం వాటికి ఆమడ దూరంలో ముర దూరం రో బుడుగో అన్నట్టు ఉండేవాడు. 

ఏ అమ్మాయితోనూ అతనికి ఎలాంటి అఫైర్స్ లేవు. అతని మనసంతా కేవలం భగవంతుని భక్తి, సమాజంపై అమాయకపు జాలితో మాత్రమే నిండి ఉంది.

​కాలేజీ చదువు ఐపోగానే, చల్ల నీళ్లుకి సిటీలోని ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌లో రిసెప్షనిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. 

జీతం తక్కువే అయినా, ఆ చిన్న ఉద్యోగంలోనే అతను ఎంతో తృప్తిగా, సంతోషంగా ఉండేవాడు. 

అతనికి బైక్ లేదా కారు నడపడం రాదు, నేర్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు కూడా. హాస్పిటల్ నుండి అతను ఉండే రూమ్ దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉండేది. రోజు ఎంత ఎండ ఉన్నా, వాన వచ్చినా ఆ దూరాన్ని నడుస్తూనే వెళ్లేవాడు. ఆ


Amyaktvaniki maru peru challa nillu



 సాదాసీదా జీవితం అతనికి ఎంతో ఇష్టం. అతని రోజంతా చాలా పద్ధతిగా ఉండేది—పగలంతా హాస్పిటల్ కౌంటర్ దగ్గర కూర్చుని వచ్చే పేద రోగులకు నవ్వుతూ సహాయం చేయడం, డ్యూటీకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు దారిలో ఉండే కాళీ మాత ఆలయంలో తలవంచి మొక్కుకోవడం, రాత్రి ఇంటికి వచ్చాక తన మనసులోని ఆలోచనలను, సమాజంలో చూసిన సంఘటనలను కథల రూపంలో ఒక బ్లాగ్‌లో రాసి పబ్లిష్ చేయడం.


             3. చీకటి నీడ – సైకో 'కాత్రే' ప్రవేశం



​అతను తన చిన్న ప్రపంచంలో ఎంతో ఆనందంగా, ఏ పాపం ఎరుగకుండా బతుకుతున్నాడు. కానీ, చీకట్లో దాగి ఉన్న ఒక క్రూరమైన, భయంకరమైన కన్ను తన అమాయకత్వాన్ని నిశితంగా గమనిస్తూనే ఉంది అన్న విషయం చల్ల నీళ్లుకి అస్సలు తెలియదు. ఆ నీడ మరెవరో కాదు, సిటీని గజ గజ లడిస్తున్న సైకో 'కాత్రే'. 



కాత్రే మనస్తత్వం చాలా విచిత్రమైనది, భయంకరమైనది. అతనికి సమాజంలో ఉండే అమాయకత్వం అన్నా, ప్రశాంతత అన్నా తీవ్రమైన అసహ్యం. ఎవరైతే ఏ గొడవలకు వెళ్లకుండా, ప్రశాంతమైన మనసుతో ఉంటారో, వారి మెదడులోకి దూరి దాన్ని పూర్తిగా నాశనం చేయడం, వారి జీవితాలను చిన్నాభిన్నం చేయడం కాత్రేకి ఒక అలవాటు.

​కాత్రే ఎప్పుడూ ఒక పాత, పెద్ద, తుప్పు పట్టిన కత్తెరను తన వెంట ఉంచుకునేవాడు. ఆ కత్తెర శబ్దం వింటేనే ఎంతటి వారికైనా ఒళ్లు వనికి పోతుంది. చల్ల నీళ్లు యొక్క మితిమీరిన అమాయకత్వం, అతని దైవభక్తి కాత్రే దృష్టిని ఆకర్షించాయి. చల్ల నీళ్లు జీవితాన్ని, అతని ప్రశాంతతను ఎలా ముక్కలు చేయాలా అని కాత్రే సరైన సమయం కోసం చీకట్లోనే పొంచి చూడటం మొదలుపెట్టాడు.

      4.నిమకట్టారి గ్రామం లో వింత సంఘటన



​ఒకరోజు మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. చల్ల నీళ్లు ఎప్పటిలాగే హాస్పిటల్ రిసెప్షన్ కౌంటర్ దగ్గర కూర్చుని తన పని చేసుకుంటున్నాడు. అప్పుడు అనుకోకుండా అతని కన్ను బయట ఉన్న ఫుట్‌పాత్ పై పడింది. 


అక్కడ దాదాపు యాభై ఏళ్ల వయసున్న ఒక  వృద్ధురాలు పడుకుని ఉంది. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 

నోటి నుండి నురగలు వస్తున్నాయి, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ  విలవిలలాడుతూ శ్వాస తీసుకోవడానికి కష్టపడుతోంది. 

ఈ క్రూరమైన సమాజం యొక్క అసలు రంగు అక్కడ స్పష్టంగా కనిపించింది. ఆ వృద్ధురాలికి కప్పుకోవడానికి కనీసం ఒక చిన్న దుప్పటి కూడా లేదు. 

ఎండ తీవ్రతకు, అనారోగ్యానికి తట్టుకోలేక ఆమె తన వద్ద ఉన్న రెండో పాత చీరను ఒంటిపై కప్పుకుని పడుకొని ఉన్నది.

​కానీ ఇంతలో అక్కడికి ఒక రాతి గుండె గల, కఠిన మనసు గల దుర్మార్గుడు వచ్చాడు. 

వాడు ఆ చనిపోతున్న వృద్ధురాలిపై ఏమాత్రం జాలి లేకపోగా, ఆమె ఒంటిపై ఉన్న ఆ పాత చీరను కూడా బలవంతంగా లాగేసుకున్నాడు. 

ఆమె నిస్సహాయంగా చూస్తుండగానే, ఆ చీరను తానే కప్పుకుని ఆమె పక్కనే సిగ్గు లేకుండా పడుకున్నాడు. సమాజంలో మానవత్వం ఎంతగా దిగజారి పోతుంది అని చెప్పడానికి ఆ దృశ్యం ఒక నిదర్శనం.


5. రాతి గుండెల ధనవంతులు – ముక్కలైన చల్ల నీళ్లు మనసు



​ఆ సమయంలో హాస్పిటల్‌లోని పెద్ద పెద్ద డాక్టర్లు, విఐపి సార్‌లు, కోట్లు సంపాదించే ధనవంతులు తమ లగ్జరీ కార్లలో అక్కడి నుండే వెళ్తున్నారు. కొందరు కారు అద్దాలు దించి చూశారు, మరికొందరు చూసీచూడనట్లు వెళ్ళారు. కానీ ఎవ్వరూ ఆ వృద్ధురాలిని కాపాడాలి అని అనుకోలేదు, కనీసం హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఇది చూసి చల్ల నీళ్లు దయా హృదయం క్షీణించి పోయింది. అతని కళ్లలో నీళ్లు కన్నీళ్లు తిరిగాయి. అతను తన కౌంటర్ వదిలేసి వెంటనే హాస్పిటల్ లోపల ఉన్న ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ కేబిన్ వైపు  పరిగెత్తాడు.

Doctor kosam thapana tho


​కేబిన్ లోకి వెళ్లి రొప్పుతూ, ఏడుస్తూ ఇలా అన్నాడు: "సార్! ప్లీజ్ ఒక్కసారి బయటకి రండి సార్. బయట ఫుట్‌పాత్‌పై ఒక అనాథ వృద్ధురాలు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు ఏమైందో తెలియదు కానీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది సార్. మనం డాక్టర్లం కదా సార్, మన హాస్పిటల్ పక్కనే ఉంది, మనం అనుకుంటే ఆమెకు సహాయం చేయవచ్చు. ప్లీజ్ ఏదైనా చేసి ఆమెను ఆదుకుందాం సార్!" అని కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు.


                     6. డాక్టర్  అహంకారం



​​ఆ అహంకారి అయిన డాక్టర్ తన ఖరీదైన కుర్చీలో వెనక్కి చేరబడుతూ, చేతిలో ఉన్న పెన్నును బల్లపై బాదాడు. చల్ల నీళ్లుని పై నుండి కింది దాకా ఒక పనికిరాని వాడిలా చూశాడు. అతని ముఖంలో పేదలన్నా, అమాయకులన్నా ఉండే అసహ్యం స్పష్టంగా కనిపించింది. అతను ఎంతో కఠినమైన స్వరంతో, హాస్పిటల్ కారిడార్ మొత్తం వినిపించేలా గట్టిగా అరిచాడు:

"ఏయ్ చల్ల నీళ్లు! నీ ఔకత్ (స్థాయి) ఏంటో నువ్వు మర్చిపోకు. నువ్వు ఇక్కడ కేవలం ఒక చిన్న రిసెప్షనిస్ట్‌వి మాత్రమే. నీ పేరు చల్ల నీళ్లు కదా, ఎక్కువ ఉడుకు అవ్వకు, ప్రశాంతంగా చల్లగా ఉండు! ఇక్కడ రోడ్డు మీద పడే ప్రతి అనాథకు ఉచితంగా వైద్యం చేయడానికి నేను కోట్ల ఖర్చు పెట్టి చదువుకోలేదు, ఈ హాస్పిటల్ కట్టలేదు. ఎక్కువ నాటకాలు ఆడి సోషల్ సర్వీస్ చేయాలనుకోకు, ఉద్యోగంలోంచి తీసి వేస్తాను. వెళ్లు ఇక్కడి నుండి! వెళ్లి నీ పని చూసుకో!"


Doctor nee bathimi.ladu thunna challa nillu



​​ఆ మాటలు వినగానే చల్ల నీళ్లు మనసు బద్దలైంది. వైద్యం అంటే వ్యాపారం అయిపోయిన ఈ రోజుల్లో దయకు విలువ లేదని అతనికి అర్థమైంది. ఆ రాత్రి అతను ఎంతో బరువైన మనసుతో, కన్నీళ్లతో తన ఇంటికి తిరిగి వచ్చాడు. 


సమాజం యొక్క ఈ నల్లటి నిజం గురించి, ఆ వృద్ధురాలి కళ్ల ముందే జరిగిన దీనస్థితి గురించి, డాక్టర్ వ్యవహరించిన తీరు గురించి భావోద్వేగంతో తన బ్లాగ్‌లో ఒక సుదీర్ఘమైన పోస్ట్ రాశాడు. కానీ దాన్ని పబ్లిష్ చేయడానికి ధైర్యం లేక డ్రాఫ్ట్‌లో సేవ్ చేసి, మంచంపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ పడుకున్నాడు. ఈ ప్రపంచంలో మానవత్వం పూర్తిగా లేకుండానే పోయిందని అతనికి నమ్మకం కుదిరింది.


         7. ఆ నల్లటి ఉదయం కారు ప్రయాణం 



​మరుసటి రోజు చల్ల నీళ్లు తన నైట్ duty ముగించుకొని తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరాడు. చలిగా ఉంది, దారి పొడవునా మంచు కురుస్తోంది, అంతా నిర్మానుష్యంగా ఉంది. రోడ్డుపై కనీసం ఒక్క మనిషి కూడా లేడు. ఇంతలో వెనుక నుండి ఒక నల్లటి లగ్జరీ కారు అతి వేగంగా, టైర్ల శబ్దం చేస్తూ వచ్చి అతని ముందు అడ్డంగా నిలబడింది. 


​చల్ల నీళ్లు ఏమైందో అర్థం చేసుకునే లోపే, కారు తలుపులు తెరుచుకున్నాయి.

​కారులో నుండి ముగ్గురు ధనవంతులైన అమ్మాయిలు బయటకు వచ్చారు. వారు ముగ్గురు రాత్రంతా పార్టీ చేసి, పూర్తిగా మత్తులో ఉన్నారు. 

వారి కళ్లలో అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాంటి ఆలోచన లేకుండా, చల్ల నీళ్లు కాలర్ పట్టుకుని బలవంతంగా లాగి కారులోకి తోశారు. చల్ల నీళ్లు భయంతో కేకలు వేస్తూనే ఉన్నాడు, "నన్ను వదిలేయండి, నేనేం తప్పు చేశాను, ప్లీజ్ నన్ను వెళ్లనివ్వండి" అని చేతులు జోడించి అడుగుతున్నాడు. కానీ ఆ అమ్మాయిల తలకెక్కిన పొగరు, మత్తు వారిని ఏ మాట విననివ్వలేదు. వారు కారును సిటీకి చాలా దూరంలో ఉన్న ఒక పాడుబడిన, పాత ఫ్యాక్టరీ భవనంలోకి లాక్కొని వెళ్ళారు.

​       8. అమాయకత్వానికి జరిగిన పరాభవం



​నగరానికి చాలా దూరంలో ఉన్న ఆ పాడుబడిన పాత ఫ్యాక్టరీ ఒక శిథిలాలయంలా ఉంది. చుట్టూ దట్టమైన చీకటి, లోపల చెమ్మ వాసన, గోడలపై సాలెగూళ్లు. ఆ భయంకరమైన ప్రదేశంలోకి ఆ ముగ్గురు ధనవంతులైన అమ్మాయిలు చల్ల నీళ్లను బలవంతంగా తీసుకువచ్చి వదిలేశారు.


ఆ ప్రదేశాన్ని చూడగానే చల్ల నీళ్ల గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను ఒక మూలలో నిలబడి, వణికిపోతూ, చేతులు జోడించి వారిని ప్రాధేయపడ్డాడు, "దయచేసి నన్ను వదిలేయండి, నేను మీకు ఏ తప్పు చేయలేదు, నన్ను ఇంటికి వెళ్లనివ్వండి" అని.


కానీ ఆ అమ్మాయిల మనసుల్లో కనికరం అనేదే లేదు. వారి కళ్లలో కేవలం డబ్బు మదం, అహంకారం మాత్రమే కనిపిస్తున్నాయి. వారు చల్ల నీళ్ల యొక్క సాదాసీదా జీవితాన్ని, అతను రోజూ మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లే ఆ అలవాటును, అతని దైవభక్తిని గుర్తు చేసుకుంటూ వెటకారంగా నవ్వడం మొదలుపెట్టారు.


ఒక అమ్మాయి అంది, "ఈ కాలంలో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా? బైకులు, కార్లు వదిలేసి నడుచుకుంటూ వెళ్తాడంట, భగవంతుడిని నమ్ముతాడంట" అని అందరూ గట్టిగా నవ్వారు.


ఆ మాటలు విన్న చల్ల నీళ్ల మనసు ముక్కలైంది. అతని కళ్ల నుండి కన్నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. ఈ సమాజంలో మంచిగా ఉండటమే తప్పా అని అతను తనలో తాను ప్రశ్నించుకున్నాడు. లో లోపల కుమిలి పోయాడు.  తన సాదాసీదా బట్టలను చూసుకుని అతను మరింత బాధపడ్డాడు.


చాలాసేపు అతన్ని మాటలతో అవమానించిన తర్వాత, ఆ ముగ్గురు అమ్మాయిలు అక్కడి నుండి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. వెళ్తూ వెళ్తూ వారిలో ఒక అమ్మాయి వెనక్కి తిరిగి, చాలా పొగరుగా, గర్వంగా ఇలా అంది, "విను కుర్రాడా, మేము చాలా పెద్ద కోటీశ్వరుల పిల్లలం. మా నాన్నలకు ఈ నగరంలో చాలా పలుకుబడి ఉంది. మేము ఏం చేసినా ఎవరూ మమ్మల్ని ఏమీ చేయలేరు. పోలీసులు కూడా మా మాట వింటారు. నీలాంటి చిన్న రిసెప్షనిస్ట్ మా కాళ్ల కింద దుమ్ముతో సమానం."


ఈ మాటలు చెప్పి వారు తమ ఖరీదైన నల్లటి కారులో ఎక్కి, పెద్ద శబ్దంతో ఇంజన్ స్టార్ట్ చేసి, ఆ చీకటి ఫ్యాక్టరీలో దుమ్ము రేపుతూ వెళ్లిపోయారు. వెనకాల మిగిలిపోయాడు చల్ల నీళ్లు ఒక్కడే. ఆ శిథిలాలయంలో ఒంటరిగా కూర్చుని, పైకి ఆకాశం వైపు చూస్తూ, "దేవుడా, నిజంగా ఈ ప్రపంచంలో అమాయకులకు న్యాయం జరగదా? మంచిగా ఉండటమే నేను చేసిన పెద్ద తప్పా?" అని గట్టిగా ఏడుస్తూ అరిచాడు. రోధించాడు 



​       9. అర్ధరాత్రి 12 గంటలు – కాత్రే ఆగమనం



​సమయం సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు దాటింది. ఆ పాడుబడిన భవనంలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడు సరిగా అప్పుడే అక్కడి వాతావరణం మారిపోయింది, గాలి మంచులా చల్లగా మారిపోయింది. ఆ భవనం విరిగిన తలుపు దగ్గర ఒక పొడవాటి, భయంకరమైన నీడ కనిపించింది. ఆకాశంలో వచ్చిన మెరుపుల కాంతిలో ఆ ముఖం స్పష్టంగా తెలిసింది—అతనే 'సైకో కాత్రే'. అతని ముఖంపై ఒక భయంకరమైన, వికృతమైన నవ్వు ఉంది. అతని కుడిచేతిలో ఒక పాత, పెద్ద తుప్పు పట్టిన కత్తెర మెరుస్తూ, 'కట్ కట్' అనే భయానక శబ్దాన్ని చేస్తున్నట్టు ఉంది.





కాత్రే మెల్లగా, భారమైన అడుగులతో చల్ల నీళ్లు దగ్గరకు వచ్చాడు. చల్ల నీళ్లు భయంతో వణికిపోతూ కళ్లు తెరవలేదు. కానీ కాత్రే అతనికి ఎలాంటి హాని చేయలేదు, బదులుగా తన కత్తెరతో చల్ల నీళ్లు కట్లను ఒక్క క్షణంలో కత్తిరించి విడిపించాడు. కాత్రే కళ్లు చీకట్లో నిప్పుకణంలా మెరిసి పోతున్నాయి. అతను చల్ల నీళ్లు భుజంపై తన చల్లటి చేయి వేసి అన్నాడు, అతని గొంతు ఆ భవనంలో ధ్వనించింది:

​"ఏడవకు, చల్ల నీళ్లు. భగవంతుడు న్యాయం చేయడానికి ఆలస్యం చేయవచ్చు, కానీ ఈ కాత్రే అన్యాయాన్ని ఒక్క క్షణం కూడా సహించలేడు. సమాజంలో అమాయకులను వేధించే హక్కు ఎవరికీ లేదు. నీ అమాయకత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఆ దుర్మార్గుల పాపాలను నా చేతిలో ఉన్న ఈ కత్తెర చూసుకుంటుంది. ఇప్పుడు నీకు సహాయం నేను చేస్తాను, అసలైన న్యాయం నేనే చేస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు." ఆ మాట చెప్పి కాత్రే చీకట్లోకి మాయమయ్యాడు. ఆ రాత్రే, ఆ భయంకరమైన ప్రతికార చెలగాటం మొదలైంది.


10. మొదటి శిక్ష – అహంకారి డాక్టర్‌కు గుణపాఠం



​రాత్రి సమయం 2 గంటలు దాటింది. ఆ అహంకారి అయిన సీనియర్ డాక్టర్ తన లగ్జరీ బంగ్లాలోని ఏసీ బెడ్‌రూమ్‌లో కింగ్ సైజ్ మంచం మీద నిద్ర లో ఉన్నాడు. హఠాత్తుగా అతని ముఖంపై ఏదో  గడ్డకట్టేంత చల్లటి  ద్రవం పడినట్లు అనిపించింది. అతను హాబరు గాబరుగా కంగారు పడుతూ , శ్వాస పీలుస్తూ కళ్లు నిమురుకుంటూ తెరిచాడు. 


రూమ్‌లో లైట్లు అన్నీ ఆపి ఉన్నాయి, కానీ కిటికీ నుండి వస్తున్న వెన్నెల కాంతిలో తన మంచం పక్కన ఒక భారీ ఆకారం నిలబడి ఉండటం చూశాడు. 

భయంతో అతని గుండె భుజం దాకా జారి, చప్పుడు లేకుండా ఆగినంత పని అయింది. 

కచ్చితంగా చూస్తే.. అతను మరెవరో కాదు, కాత్రే!



​డాక్టర్ గట్టిగా అరవబోయే లోపే, కాత్రే తన చూపులతోనే అతన్ని భయపెట్టాడు. 

కాత్రే మెల్లగా నవ్వుతూ, గంభీరంగా అన్నాడు, "నువ్వే కదా అన్నావు..   (చల్ల నీళ్లు) ఎక్కువ వేడెక్కకుండా చల్లగా ఉండాలని? ఈరోజు నీ అహంకారానికి శాశ్వతంగా ముగింపు పలుకుతున్నాను." డాక్టర్ కళ్లలో తీవ్రమైన భయం స్పష్టంగా కనిపించింది. 

చేతులు జోడించి వదిలేయమని బతిమాలాడు. కానీ కాత్రే ఆ రాత్రే ఆ డాక్టర్ అహంకారానికి, అతని గర్వానికి ఎప్పటికీ ముగింపు పలికి, అతను చేసిన మోసాలను చట్టానికి దొరికిపోయేలా చేశాడు.



​11. హైవేపై భీభత్సం – ముగ్గురు అమ్మాయిల అహంకార అణచివేత




​మరుసటి రోజు రాత్రి, సమయం దాదాపు ఒంటి గంట అవుతోంది. 

జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా చీకటి, నిశ్శబ్దం. అప్పుడప్పుడు ఒకటి రెండు లారీలు మాత్రమే వెళ్తున్నాయి.

 ఆ నిర్మానుష్యమైన హైవేపై అదే నల్లటి లగ్జరీ కారు చాలా వేగంగా దూసుకుపోతోంది. 

అందులో ఆ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వారు అప్పుడే ఒక పెద్ద పబ్‌లో జరిగిన పార్టీ నుండి తిరిగి వస్తున్నారు.


కారు లోపల పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టుకుని, వారు ఇంకా తమ అహంకారపు మాటల్లోనే ఉన్నారు.

 నిన్న రాత్రి చల్ల నీళ్లను ఎలా భయపెట్టామో, అతను ఎలా ఏడ్చాడో గుర్తు చేసుకుని వారు పగలబడి నవ్వుతున్నారు. 

వారికి తమ డబ్బు మీద, తమ అందం మీద విపరీతమైన గర్వం తో కూడిన అహం.


ఇంతలో హఠాత్తుగా డ్రైవ్ చేస్తున్న అమ్మాయికి రోడ్డు మధ్యలో ఒక పొడవాటి ఆకారం నిలబడి ఉన్నట్లు కనిపించింది. 

ఆ ఆకారం కదలకుండా, మెదలకుండా రోడ్డుకు అడ్డంగా నిలబడి ఉంది. దాన్ని చూసి ఆమె కంగారుగా హడావిడి పడుతూ, గట్టిగా బ్రేక్ వేసింది. 

టైర్లు రోడ్డుపై రాసుకుంటూ కారు పెద్ద శబ్దంతో ఆగిపోయింది.


"ఏయ్, ఎవరు నువ్వు? రోడ్డు మధ్యలో ఏం చేస్తున్నావ్? పక్కకు తప్పుకో!" అని ముగ్గురు అమ్మాయిలు కిటికీల్లో నుండి తలలు బయటకు పెట్టి గట్టిగా అరిచారు.


అప్పుడు ఆ నీడ మెల్లగా కారు వైపు నడవడం మొదలైంది. వెన్నెల వెలుతురులో ఆ ముఖం స్పష్టంగా కనిపించింది. అతనే కాత్రే. 

అతని ముఖంలో కోపం లేదు, కేవలం న్యాయం చేయాలనే గంభీరత మాత్రమే ఉంది.


కాత్రే కారు దగ్గరకు వచ్చి, చాలా ప్రశాంతంగా, కానీ గుండెను తాకేలా అన్నాడు, "మీరు అన్నారు కదా, మీరు అమ్మాయిలు, కోటీశ్వరుల పిల్లలు, మీరు ఏం చేసినా చెల్లుతుంది అని? మీ డబ్బుతో చట్టాన్ని కూడా కొనగలమని అనుకున్నారా? ఈరోజు మీకు తెలుస్తుంది, చట్టం కంటే ఎవరూ గొప్పవారు కాదని."


ఆ మాటలు వినగానే ఆ ముగ్గురు అమ్మాయిల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వారి ముఖాల్లో ఉన్న నవ్వు, మత్తు అంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది.

 వారు భయంతో వణికిపోవడం మొదలైంది. కారును వెనక్కి తిప్పి పారిపోవాలని ప్రయత్నించారు, కానీ భయంతో కారు స్టార్ట్ కూడా కాలేదు.


ఆ రాత్రి కాత్రే వారి గురించిన పూర్తి వివరాలను, వారు చల్ల నీళ్ల పట్ల ప్రవర్తించిన తీరుకు సంబంధించిన అన్ని నిజాలను, వారి కారు నంబరు, వారు ఉన్న ప్రదేశం వంటి పక్కా ఆధారాలను సేకరించి, తెల్లవారేలోపు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అందించాడు. పోలీసులు వెంటనే స్పందించి, ఆ ముగ్గురు అమ్మాయిలను అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం కేసు నమోదు చేశారు. 

ఆ విధంగా వారి డబ్బు, పలుకుబడి, అహంకారం అన్నీ ఒక్క రాత్రిలోనే కూలిపోయాయి.


​             12. ముగింపు: ఒక కొత్త ఉదయం



​మరుసటి రోజు ఉదయం నీమకఠారి గ్రామం మరియు సిటీ మొత్తం ఒకటే మాట చెలరేగింది. 

ప్రతి న్యూస్ ఛానెల్‌లో, పేపర్లలో కేవలం ఆ పెద్ద కార్పొరేట్ డాక్టర్ మరియు ముగ్గురు ధనవంతులైన అమ్మాయిలు చేసిన మోసాలు బయటపడి వారు అరెస్ట్ కావడం గురించే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. 

సిటీ పోలీసులు, టాప్ డిటెక్టివ్‌లు రంగంలోకి దిగారు. కానీ ఆ ఆధారాలు పోలీసులకు ఎవరు పంపారో ఎవరికీ తెలియదు, క్లూస్ కూడా ఏమీ లేవు. ఆ కాత్రే ఎలాంటి ఆనవాళ్లు వదల్లేదు.

​కానీ ఆ ఉదయం చల్ల నీళ్లు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతను ఎప్పటిలాగే మేలుకున్నాడు, స్నానం చేశాడు, నీమకఠారి దారిలో ఉన్న కాళీ మాత గుడికి వెళ్లి భక్తితో తల వంచి దండం పెట్టుకున్నాడు. 

ఆపై తిరిగి హాస్పిటల్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. అతని ముఖంలో అదే పాత అమాయకత్వం, అదే ప్రశాంతత ఉన్నాయి. లోపల ఎలాంటి భయం లేదు.

​రాత్రి అతను తిరిగి తన రూంలోకి వచ్చాక, తన లాప్‌టాప్ ఆన్ చేశాడు. అతను అవాక్కయ్యాడు.. 

తను రాసిన ఆ డ్రాఫ్ట్ బ్లాగ్ (తనపై జరిగిన అన్యాయం మరియు ఆ వృద్ధురాలి దీనస్థితి గురించి) దానంతట అదే పబ్లిష్ అయి ఉండటం చూశాడు. 

దానికి లక్షల మంది వ్యూస్, వేల కొలది కామెంట్లు వచ్చాయి. కానీ ఆ బ్లాగ్ కింద, మెరిసే ఎర్రటి అక్షరాలతో ఒక చివరి లైన్ కొత్తగా యాడ్ అయి ఉంది. దాన్ని చూసి చల్ల నీళ్లు పెదవులపై ఒక చిన్న, నిగూఢమైన నవ్వు వచ్చింది. ఆ లైన్ ఇలా ఉంది:

​"అమాయకత్వాన్ని అణచివేసేవారు గుర్తుపెట్టుకోండి... చట్టం నిద్రపోతే, న్యాయం చేయడానికి కాత్రే మేల్కొనే ఉంటాడు. - కాత్రే ఎప్పటికీ ఉంటాడు"


స్నేహితులారా ఇందులో చూపించిన కాత్రే  ఎవరో  అసలు అతను ఎందుకు సైకో మారాడు తెలుసుకోవడానికి చదవండి 

కాత్రే  భాగం 1

కాత్రే  భాగం 2

 © Copyright challagali Yesudas All Rights reserved 

Comments

Popular posts from this blog

పాత టంకు పెట్టె (Part 1)

LAST CIGARETTE (లాస్ట్ సిగరెట్) - భాగం 1

​విరిగిన గడియారం (Tuti Hui Ghadi)